సచిన్ ‘స్ట్రింగ్ బ్రా’ ధరించాడేంటి?.. యాక్టివిస్ట్ ఓవరాక్షన్

by  |
సచిన్ ‘స్ట్రింగ్ బ్రా’ ధరించాడేంటి?.. యాక్టివిస్ట్ ఓవరాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్‌పైనే సెటైర్స్ వేసింది ఓ సోషల్ యాక్టివిస్ట్. యాంటి బ్రాహ్మణ్‌ యాక్టివిస్ట్‌గా ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన డాక్టర్ మీనా కందసామి.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌నే అవమానించింది. దుస్తులపై నుంచి జంధ్యం ధరించడాన్ని ట్రోల్ చేసింది. ‘ఇది రియల్ పిక్చరేనా.. మీ దుస్తుల లోపల ధరించాల్సిన ఒక రకమైన లోదుస్తుల(జంధ్యం)ను ఇలా వేసుకున్నారు ఏంటి?’ అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు పవిత్రమైన జంధ్యంను ‘స్ట్రింగ్ బ్రా’ అంటూ హేళన చేసింది. దీంతో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. పవిత్రదారాన్ని హేళన చేస్తూ తమ మనోభావాలను దెబ్బతీసిన యాక్టివిస్ట్‌పై చర్యలు తీసుకోవాలని ఈ మేరకు డిమాండ్ చేస్తున్నారు. కాగా సచిన్ వినాయక చవితి సందర్భంగా పోస్ట్ చేసిన ఫొటోపై ఇలాంటి కామెంట్ చేసింది యాక్టివిస్ట్.


Next Story