- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2న హుస్నాబాద్ కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..
<p>దిశ, హుస్నాబాద్: అక్టోబర్ 2వ తేదీన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రానున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావు తెలిపారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ప్రారంభించిన ప్రజా సంగ్రామ పాదయాత్ర అక్టోబర్ 2వ తేదీన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ముగింపు కానుందన్నారు. దీంతో హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ […]</p>

దిశ, హుస్నాబాద్: అక్టోబర్ 2వ తేదీన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రానున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావు తెలిపారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ప్రారంభించిన ప్రజా సంగ్రామ పాదయాత్ర అక్టోబర్ 2వ తేదీన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ముగింపు కానుందన్నారు. దీంతో హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రూట్ మ్యాప్ కన్వీనర్ మనోహర్ రెడ్డి తెలిపారు.
బహిరంగ సభకు జిల్లా, పలు నియోజకవర్గాల నుంచి బీజేపీ పార్టీ నాయకత్వంతో పాటు అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని కొరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






