ప్రముఖ టెన్నిస్ స్టార్‌కు లవ్ ప్రపోసల్.. కేంద్రమంత్రి షేరింగ్ వీడియో వైరల్..!

by  |
steffi-graf-irani
X

దిశ, వెబ్‌‌డెస్క్ : కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani)సామాజిక మాద్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. రాజకీయాల పరంగానే కాకుండా, ఇతర ముఖ్యమైన, ఫన్నీ అంశాలపై కూడా తన అభిప్రాయాన్ని నెటిజన్లతో పంచుకుంటారు. తాజాగా కేంద్రమంత్రి టెన్నిస్ లెజెండ్ స్టెఫీ గ్రాఫ్‌కు సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టా గ్రా‌మ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం అది కాస్తా తెగ వైరల్ అవుతోంది.

సాధారణంగా టెన్నిస్ ఆటకు అభిమాని అయిన స్మృతి ఇరానీ.. మాజీ జర్మన్ టెన్నిస్ క్రీడాకారిణి ‘స్టెఫీ‌ గ్రాఫ్’ 52వ పుట్టినరోజును పురస్కరించుకుని 90వ దశకంలోని ఓ వింబుల్డన్ టోర్నీలో చోటుచేసుకున్న ఫన్నీ మూమెంట్‌ను పంచుకున్నారు. ఆనాడు స్టెఫీ గ్రాఫ్ మరియు జపాన్ క్రీడాకారిణి కిమికో డేట్ మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా కోర్టులో ఈ అద్భుతమైన క్షణం వెలుగు చూసింది.

ఆట మధ్యలో స్టాండ్స్‌లో ఉన్న ఒక ప్రేక్షకుడు లేచి ‘‘స్టెఫీ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగ్గా.. బదులుగా నీ దగ్గర ఎన్ని డబ్బులున్నాయని’’ దిగ్గజ క్రీడాకారిణి స్టెఫీగ్రాఫ్ అతన్ని ప్రశ్నిస్తుంది’ దీంతో స్టాండ్స్‌లో ఒక్కసారిగా నవ్వులు వికసిస్తాయి. మాజీ ప్రపంచ నంబర్ వన్ అయిన స్టెఫీ.. సాదాసీదా సమాధానం అందరి హృదయాల్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది.

ఇదిలాఉండగా, 90 దశకంలో జర్మనీ దేశం తరఫున టెన్నిస్ ఆడిన స్టెఫీగ్రాఫ్ 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌ను కైవసం చేసుకోవడం గమనార్హం. 14 జూన్ 1969లో స్టెఫీ‌గ్రాఫ్ జన్మించగా.. దానిని పురస్కరించుకుని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏడు మిలియన్లకు పైగా, ఫేస్‌బుక్‌లో మరో రెండు మిలియన్లకు పైగా ఇప్పటికే వ్యూస్ వచ్చాయి. అయితే, ఈ వారం ప్రారంభంలో ‘ఐకానిక్ మహిళా అథ్లెట్ ప్రతి స్పందనతో చాలా మంది అభిమానులు మరోసారి ప్రేమలో పడ్డాడని’ ప్రతిస్పందనలు వస్తున్నాయి.

Next Story