స్కోడా నుంచి లిమిటెడ్ ఎడిషన్ ఆక్టేవియా ఆర్ఎస్ 245!

by  |
స్కోడా నుంచి లిమిటెడ్ ఎడిషన్ ఆక్టేవియా ఆర్ఎస్ 245!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆటో సెక్టార్‌లో స్కోడా లిమిటెడ్ ఎడిషన్ ఆక్టేవియా ఆర్ఎస్ 245 మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 35.99 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించినట్టు స్కోడా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలీస్ వెల్లడించారు. మార్చి 1 నుంచి ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఇప్పటికే 200 కార్లను అందుబాటులోకి తెచ్చామని, దీన్ని బుక్ చేసుకోవడానికి ముందుగా రూ. లక్ష చెల్లించాలని పేర్కొంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ కార్ల అమ్మకాలను ప్రత్యేక వెబ్‌సైట్ బుక్‌స్కోడా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతాయని వెల్లడించింది.

ఇక ఫీచర్స్ విషయానికొస్తే, ఈ కారు ఇంజన్ 2 లీటర్ల పెట్రోల్‌తో తయారు చేయబడింది. ఆటోమెటిక్ డ్యుయల్ క్లచ్ ట్రాన్సిమిషన్, ఏడు గేర్లు వంటి ప్రత్యేకతలతో పాటు, కేవలం 6.6 సెకన్లలో వంద కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుందని చెప్పారు. ఈ కారు గరిష్ఠ వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఇక లిమిటిడ్ ఎడిషన్ కావడంతో ఆక్టేవియా ఆర్ఎస్ 245 మ్యాజిక్ బ్లాక్, రెడ్, క్యాండీ వైట్, రేస్ బ్లూ, ర్యాలీ గ్రీన్ వంటి ఐదు రంగుల్లో లభించనుంది.


Next Story

Most Viewed