మిరాకిల్ ‘స్కిప్పర్’.. ఆ కుక్కపిల్లకు ఆరు కాళ్లు, రెండు తోకలు

by  |
six legs dog born in usa
X

దిశ, వెబ్‌డెస్క్ : స్కిప్పర్.. ప్రస్తుతం ఈ పేరును ఓ అద్భుతంగా వైద్యులు అభివర్ణిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ‘స్కిప్పర్’ మిరాకిల్ క్రియేట్ చేసిందని చెప్పుకుంటున్నారు. ఇంతకు స్కిప్పర్ అంటే ఎంటీ అనుకుంటున్నారా.. నాలుగు రోజుల వయస్సున్న ‘ఆడ కుక్కపిల్ల’.. సాధారణంగా కుక్క పిల్లలు పుట్టినపుడు చాలా ముద్దొస్తుంటాయి. పెరిగి పెద్దయ్యాక విశ్వాసానికి మారుపేరుగా నిలుస్తుంటాయి. అయితే, స్కిప్పర్ మాములు కుక్కపిల్ల కాదు. ఫస్ట్ టైం దాన్ని చూసిన వారెవరైనా ఆశ్చర్యానికి గురవుతారు. కారణం దాని శరీరాకృతే..

మాములుగా కుక్కలకు నాలుగు కాళ్లు, ఒక తోక ఉంటుంది. కానీ, అమెరికాలోని ఓక్లహోమాలో జన్మించిన స్కిప్పర్‌కు మాత్రం ‘‘ఆరు కాళ్లు, రెండు తోకలు, రెండు పునరుత్పత్తి వ్యవస్థలు’’ ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం దీని వయస్సు నాలుగురోజులు. అయితే, నార్మల్‌గా జన్మించే జంతువుల కంటే అవలక్షణాలతో జన్మించేవి ఎక్కువ రోజులు మనుగడ సాగించలేవని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. కానీ, స్కిప్పర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉందని, దాని ఎదుగుదల కూడా మాములుగానే ఉందని వివరించారు. అంతేకాకుండా ఆరుకాళ్లు, రెండు తోకలతో జన్మించిన మొట్టమొదటి కుక్కపిల్లగా స్కిప్పర్ రికార్డు సృష్టించినదన్నారు.

అదనంగా, స్కిప్పర్‌లో ‘‘మోనోసెఫాలస్ డిపైగస్ అండ్ మోనోసెఫాలస్ రాచిపాగస్ డైబ్రాచియస్ టెట్రాపస్’’ అని పిలువబడే పుట్టుకతో వచ్చే రుగ్మతలు కలిగి ఉందన్నారు. వెటర్నరీ హాస్పిటల్ ఫేస్‌బుక్ పేజీలో పొందుపరిచిన వివరాల ప్రకారం.. స్కిప్పర్‌కు ‘ఒక తల, చాతీ కుహరం ఉంది. రెండు కంటి ప్రాంతాలు, రెండు తక్కువ మూత్ర మార్గాలు, రెండు పునరుత్పత్తి వ్యవస్థలు, రెండు తోకలు మరియు ఆరు కాళ్ళు ఉన్నాయి. ఇక్కడ విచారం ఎంటంటే.. స్కిప్పర్‌కు జన్మనిచ్చిన తల్లి కుక్క వెళ్లిపోగా, బాటిల్‌తో దానికి ఫీడింగ్ చేస్తున్నారు. స్కిప్పర్.. కొన్ని ప్రత్యేక లక్షణాలతో జన్మించిన కుక్క పిల్ల మాత్రమే కాదని, ఇది పుట్టిన వేళా విశేషం ఇంటర్నెట్‌లో తుఫాన్ తీసుకొచ్చిందని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.


Next Story

Most Viewed