షాకింగ్.. రోడ్డుపై కుక్కలు పీక్కుతిన్న ‘శిశువు’ హాఫ్ బాడీ..

by  |
షాకింగ్.. రోడ్డుపై కుక్కలు పీక్కుతిన్న ‘శిశువు’ హాఫ్ బాడీ..
X

దిశ, కుత్బుల్లాపూర్ : శిశువు చాతి, చేయి భాగం ఓ కాలనీలో లభ్యమైన ఘటన కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో కలకలం సృష్టిస్తోంది. ఈ దారుణ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల డివిజన్ పరిధి ఎంఎన్ రెడ్డి నగర్ హనుమాన్ దేవాలయం సమీపంలోని రోడ్డుపై గురువారం ఉదయం సుమారు ఆరు నెలల శిశువు చేయి, చాతి భాగం పడి ఉంది.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు డాగ్ స్వ్కాడ్‌తో ఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఈ సందర్భంగా డాగ్ స్వ్కాడ్‌ స్థానికంగా ఉన్న ఖాళీ ప్రదేశం వైపు వెళ్లి వెనుదిరిగాయి. అయితే కాలనీ సమీపంలో ఓపెన్ నాలాతో పాటు, ఖాళీ స్థలం ఉండటంతో ఎవరైనా గుర్తు తెలియని వారు చనిపోయిన శిశువును.. అక్కడ పడేయడంతో కుక్కలు రోడ్డు మీదకు తీసుకువచ్చి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా గతేడాది కూడా ఇదే కాలనీలో ఓ శిశువు తల కూడా లభించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాంతి పూజలేమైనా చేశారా..? లేక ఇండ్లలో మంత్రసానులు డెలివరీ చేయగా చనిపోతే పడేశారా..? అనేది తెలియడంలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిశువు శరీర
భాగాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed