- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరుగురు చిన్నారుల సజీవదహనం
<p>పాట్నా: బీహార్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అరారియా జిల్లా కవైయా గ్రామంలో ఒక పూరి గుడిసెకు నిప్పంటుకుని చెలరేగిన మంటల్లో చిక్కుకొని ఆరుగురు అభం శుభం తెలియని చిన్నారులు సజీవ దహనమయ్యారు. మొక్కజొన్న కంకులు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు గుడిసెకు మంటలు అంటుకోవడంతో ఈ దారుణ ప్రమాదం జరిగింది. గుడిసెలో మంటలు వేగంగా వ్యాపించడంతో చిన్నారులు బయటకు రాలేక లోపలే చిక్కుకుపోయారు. గుడిసె కాలుతున్న మంటలు ఎగజిమ్మడం, లోపల చిన్నారుల హాహాకారాలను విన్న స్థానికులు అక్కడికి చేరుకొని మంటలను […]</p>

పాట్నా: బీహార్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అరారియా జిల్లా కవైయా గ్రామంలో ఒక పూరి గుడిసెకు నిప్పంటుకుని చెలరేగిన మంటల్లో చిక్కుకొని ఆరుగురు అభం శుభం తెలియని చిన్నారులు సజీవ దహనమయ్యారు. మొక్కజొన్న కంకులు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు గుడిసెకు మంటలు అంటుకోవడంతో ఈ దారుణ ప్రమాదం జరిగింది. గుడిసెలో మంటలు వేగంగా వ్యాపించడంతో చిన్నారులు బయటకు రాలేక లోపలే చిక్కుకుపోయారు. గుడిసె కాలుతున్న మంటలు ఎగజిమ్మడం, లోపల చిన్నారుల హాహాకారాలను విన్న స్థానికులు అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ పసి ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా 3-6 ఏళ్ల లోపు చిన్నారులే కావడం అందరినీ కలిచివేస్తోంది. వారి కుటుంబాలకు తీర్చని వ్యథను మిగుల్చుతున్నది. చిన్నారుల మరణంతో వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోధనలు మిన్నంటాయి.






