- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సార్ మీరు రావాల్సిందే.. రేవంత్ రెడ్డి ఆహ్వానం
<p>దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్‌గాంధీతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలో రాహుల్‌ను కలిసిన రేవంత్‌రెడ్డి.. ఈ నెల 17న రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో నిర్వహిస్తున్న దళిత, గిరిజన దండోరా సభకు రావాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రానికి వచ్చేందుకు రాహుల్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 17న దళిత దండోరా ఆఖరి సభ నిర్వహిస్తున్న […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్‌గాంధీతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలో రాహుల్‌ను కలిసిన రేవంత్‌రెడ్డి.. ఈ నెల 17న రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో నిర్వహిస్తున్న దళిత, గిరిజన దండోరా సభకు రావాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రానికి వచ్చేందుకు రాహుల్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 17న దళిత దండోరా ఆఖరి సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ సభకు రావాలని కోరారు. అదే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా రాహుల్‌కు వివరించారు.
కాగా, ఈ నెల 17న రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వస్తున్న నేపథ్యంలో రాహుల్‌ను కూడా రావాలని టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గజ్వేల్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు జాతీయ స్థాయి నేతలను ఆహ్వానించేందుకు రేవంత్‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.






