నేను డేట్‌కి రెడీ… ఓ వ్యక్తి బిల్‌బోర్డ్ ప్రకటన

by  |
నేను డేట్‌కి రెడీ… ఓ వ్యక్తి బిల్‌బోర్డ్ ప్రకటన
X

ఇంగ్లండ్‌కి చెందిన ఓ వ్యక్తి తాను డేటింగ్‌కి సిద్ధంగా ఉన్నానంటూ దాదాపు 40వేల రూపాయలతో ఓ పెద్ద హోర్డింగ్ మీద ప్రకటన ఇచ్చాడు. షెఫీల్డ్‌లో నివాసముండే 30 ఏళ్ల మార్క్ రోఫే.. “సింగిల్‌గా ఉన్నారా? మార్క్‌తో డేట్ చేయండి. మీరు ఎదురుచూస్తున్నది నాకోసమే కావొచ్చు.” అంటూ తన ఫొటోతో పెద్ద ప్రకటన ఇచ్చాడు.

దీనికి సంబంధించి ఓ వెబ్‌సైట్ కూడా పెట్టాడు. అందులో తాను చేస్తున్న పని, తాను బోర్డు ప్రకటన ఇవ్వాల్సిన అవసరం గురించి వివరించాడు. తన స్నేహితులందరికీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారని, తాను మాత్రం సింగిల్‌గా ఉన్నానని అందులో పేర్కొన్నాడు. అంతేకాకుండా తాను ఆరడుగుల ఎత్తు ఉంటానని, ఇప్పటికి ముగ్గురి కంటే ఎక్కువ మంది మహిళలను ముద్దు పెట్టుకున్నట్లు తెలియజేశాడు.

ఆ ప్రకటన మీద ఆసక్తి ఉన్న వాళ్లు ఒక జాబితాలో అడిగిన ప్రశ్నలకు సమాధానం నింపి, వారి సోషల్ మీడియా ఖాతాల వివరాలు, ఒక ఫొటోను జతచేయాలి. ఇప్పటికే 292 మంది మార్క్ ప్రియురాలిగా ఉండటానికి దరఖాస్తు చేసుకున్నారట. డేటింగ్ యాప్స్ ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఇలా ఓ స్నేహితుడి ఐడియా మేరకు బిల్‌బోర్డు ప్రకటన ఇచ్చానని మార్క్ చెప్పాడు. ఏదేమైనా ప్రేమ కోసం ఇంత తాపత్రయపడ్డాడంటే ఇతని ప్రయత్నాన్ని ఒప్పుకుని తీరాలి.

Next Story