‘సారంగ దరియా’ వివాదం ముగిసెనయా

by  |
‘సారంగ దరియా’ వివాదం ముగిసెనయా
X

దిశ, సినిమా: ‘లవ్ స్టోరి’ సినిమాలో ‘సారంగ దరియా’ పాట వివాదం ముగిసింది. ఈ పాటను చిత్రానికి వినియోగించడంలో ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించింది జానపద గాయని కోమలి. ఈ పాట సేకరణ చేసిన కోమలికి ‘లవ్ స్టోరి’ టీం సరైన క్రెడిట్ ఇవ్వలేదని పలు ఇంటర్వ్యూల్లో కన్నీరు పెట్టుకున్న ఆమె..చిత్ర దర్శకులు శేఖర్ కమ్ములను కలిశాక మీడియా ప్రకటన చేసింది. సినిమాలో సారంగ దరియా పాటను పాడించలేదనే బాధ తనలో ఉండేదని, అందుకే పలు ఇంటర్వ్యూల్లో అలా మాట్లాడానని తెలిపింది. తన నెక్స్ట్ మూవీస్‌లో సింగర్‌గా అవకాశం ఇస్తానని మాట ఇచ్చారని, ‘లవ్ స్టోరి’ ఆడియో ఫంక్షన్‌లోనూ తనతో ఈ పాట పాడిస్తానని హామీ ఇవ్వడంతో సంతోషంగా ఉన్నానని చెప్పింది కోమలి. ఈ పాట విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన శేఖర్ కమ్ముల.. కోమలితో ఫేస్ టు ఫేస్ మాట్లాడటం ఆనందంగా ఉందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం తనకు తప్పకుండా అవకాశం ఇస్తానని చెప్పారు.


Next Story