ట్రెండింగ్‌లో శింబు ఆత్మన్ వీడియో..

by  |
ట్రెండింగ్‌లో శింబు ఆత్మన్ వీడియో..
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ్ సూపర్ స్టార్ శింబు సోషల్ మీడియాలో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్ హ్యాండిల్ ఓపెన్ చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చిన శింబు.. ‘ఆత్మన్, సిలంబరసన్ టీఆర్’ పేరుతో అమేజింగ్ వీడియో పోస్ట్ చేశాడు.

‘విద్యార్థి సిద్ధంగా ఉన్నప్పుడు, గురువు వస్తాడు’ అంటూ.. తన బాడీ, మైండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి క్యాచీ మ్యూజిక్ టచింగ్‌తో రేజింగ్ వీడియో రిలీజ్ చేశాడు. అంతేకాదు ఎక్సర్‌సైజ్, యోగ, డ్యాన్స్, కత్తిసాము, కర్రసాము నేర్చుకుంటున్న గ్లింప్స్ కూడా షేర్ చేయగా.. ప్రస్తుతం Atman, SilambarasanTR హాష్ ట్యాగ్‌తో ఈ వీడియో ట్రెండింగ్‌‌లో ఉంది. ఇక ఈ నెల 26న శింబు మరో అప్‌డేట్ ఇవ్వనున్నాడని తెలుస్తుండగా.. మరి అది సినిమా గురించా? లేక మ్యారేజ్ గురించా? అనేది చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం శింబు, త్రిషల పెళ్లి అంటూ కోలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుండగా.. దీనిపైనా త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే చాన్స్ ఉంది. మరి 26న వచ్చే ప్రకటన ఇదేనేమో అనే విషయంలో అభిమానులు ఇంట్రెస్టింగ్ గాను, కాస్త ఎగ్జైటింగ్‌‌ గానూ ఉన్నారు.


Next Story

Most Viewed