'ఈశ్వరన్'గా శింబు ట్రాన్స్‌ఫర్మేషన్

by  |
ఈశ్వరన్గా శింబు ట్రాన్స్‌ఫర్మేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ్ సూపర్ స్టార్ శింబు కమింగ్ బ్యాక్‌తో అభిమానులు ఖుష్ అవుతున్నారు. సూపర్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో వచ్చేసిన శింబు..

న్యూ మూవీ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా, ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్ ఇస్తోంది. ‘ఈశ్వరన్’ పేరుతో తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్.

శింబు 46వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న సినిమాలో క్రికెటర్‌గా కనిపిస్తుండగా.. మోషన్ పోస్టర్‌లో పామును మెడలో వేసుకుని బాక్సాఫీస్‌పై ఫైట్‌గా సిద్ధమవుతున్న లుక్ అదిరిపోయింది. సంక్రాంతి బరిలో నిలుస్తున్న సినిమాకు సుశింతిరన్ డైరెక్టర్ కాగా.. బాలాజీ కప్ప నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ స్వరాలు సమకూరుస్తున్న సినిమాలో నిధి అగర్వాల్, నందిత శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కాగా ఈ లుక్ పొందేందుకు శింబు చేసిన వర్కవుట్, హార్డ్ వర్క్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. భారీగా వెయిట్ లాస్ అయిన శింబు.. మోషన్ పోస్టర్ పాము, క్రికెట్‌తో ముడిపడి ఉండగా.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకుంటోంది.


Next Story

Most Viewed