సెక్రటేరియట్ లో గురుద్వార్?

by Shyam |

<p>దిశ, తెలంగాణ బ్యూరో: సెక్రటరియేట్‌లో గురుద్వార్ నిర్మానానికి సిక్కుల నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయి. హిందూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు సిక్కులకు ప్రాధాన్యం కల్పించాలనేది తెరమీదకు వచ్చింది. అన్నిమతాలకు ప్రాధాన్యం కల్పిస్తున్న తమకు అన్యాయం చేయొద్దని ఒకటి రెండ్రోజుల్లో ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చేందుకు గురుద్వార్ కమిటీ సభ్యులు సన్నద్ధమవుతున్నారు. ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి తమ డిమాండ్‌ను ప్రభుత్వానికి తెలియజేయనున్నట్లు తెలిసింది. సర్వమతాల సమ్మేళనం తెలంగాణ. రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలకు సంబంధించిన వారు [&hellip;]</p>

gurudwar
X

దిశ, తెలంగాణ బ్యూరో: సెక్రటరియేట్‌లో గురుద్వార్ నిర్మానానికి సిక్కుల నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయి. హిందూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు సిక్కులకు ప్రాధాన్యం కల్పించాలనేది తెరమీదకు వచ్చింది. అన్నిమతాలకు ప్రాధాన్యం కల్పిస్తున్న తమకు అన్యాయం చేయొద్దని ఒకటి రెండ్రోజుల్లో ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చేందుకు గురుద్వార్ కమిటీ సభ్యులు సన్నద్ధమవుతున్నారు. ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి తమ డిమాండ్‌ను ప్రభుత్వానికి తెలియజేయనున్నట్లు తెలిసింది.

సర్వమతాల సమ్మేళనం తెలంగాణ. రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలకు సంబంధించిన వారు ఉంటారు. కలిసి జీవనం సాగిస్తున్నారు. పాత సెక్రటేరియట్ లో కేవలం మసీదు, గుడి, చర్చి మాత్రమే ఉన్నాయి. అయితే కొత్తగా భవన నిర్మాణం చేపడుతున్న సమయంలో తిరిగి వాటి నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నారు. అయితే గతంలో గురుద్వార్ లేనప్పటికీ ప్రభుత్వం అన్ని మతాలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో తమకు సైతం అవకాశం కల్పించాలని సిక్కులు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తం ఉన్న సిక్కులతో పాటు హైదరాబాద్ లోని గురుద్వార్ కమిటీలు సైతం సమావేశమై ఒకటి రెండ్రోజుల్లో ప్రభుత్వానికి వినతిపత్రం అందజేసేందుకు సన్నద్ధమవుతున్నారు. సంఖ్యాపరంగా తాము ఉన్నామని తమకు సైతం ప్రభుత్వం సమ ప్రాధాన్యం కల్పించాలని విజ్ఞప్తి చేయనున్నారు.

ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం

తెలంగాణ ప్రభుత్వం సిక్కులను సైతం గుర్తించాలి. నూతన సెక్రటేరియట్ ఆవరణలో హిందూ, ముస్లిం, చర్చిలకు ప్రార్థన మందిరాలు నిర్మిస్తున్నారు. కానీ గురుద్వార్ నిర్మాణం చేపట్టడం లేదు. గతంలో ఉన్న వాటిని పరిగణనలోకి తీసుకోవడం మంచిదే కానీ మమ్మల్ని కూడా గుర్తించి గురుద్వార్ నిర్మిస్తే బాగుంటుంది. రాష్ట్రంలోని అన్ని గురుద్వార్ కమిటీలతో సమావేశమై చర్చిస్తాం. ప్రభుత్వనికి ఒకటి రెండ్రోజుల్లో వినతిపత్రం కూడా అందజేస్తాం.

గురుద్వార్ కమిటీ అప్జల్‌గంజ్ వైస్ ప్రెసిడెంట్ నిర్మల్ సింగ్ భగ్గ

Next Story