సీఎంకు చెంప దెబ్బే సరి.. హీరో సిద్ధార్థ్ సంచలన ట్వీట్

by Shyam |

<p>దిశ, సినిమా: హీరో సిద్ధార్థ్ అన్యాయాన్ని ఖండిస్తూ వరుస ట్వీట్స్ చేస్తున్నాడు. కరోనా కాలంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును తప్పు పట్టిన ఆయన యూపీ చీఫ్ మినిస్టర్ యోగీ ఆదిత్యనాథ్‌పై ఫైర్ అయ్యాడు. ఇలా డీసెంట్ లీడర్ అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్న నేతలకు చెంప మీద గట్టిగా ఒక్కటివ్వాలని సూచించాడు. Any false claims of being a decent human being or a holy man or a leader will face one tight [&hellip;]</p>

సీఎంకు చెంప దెబ్బే సరి.. హీరో సిద్ధార్థ్ సంచలన ట్వీట్
X

దిశ, సినిమా: హీరో సిద్ధార్థ్ అన్యాయాన్ని ఖండిస్తూ వరుస ట్వీట్స్ చేస్తున్నాడు. కరోనా కాలంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును తప్పు పట్టిన ఆయన యూపీ చీఫ్ మినిస్టర్ యోగీ ఆదిత్యనాథ్‌పై ఫైర్ అయ్యాడు. ఇలా డీసెంట్ లీడర్ అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్న నేతలకు చెంప మీద గట్టిగా ఒక్కటివ్వాలని సూచించాడు.

దేశ వ్యాప్తంగా ప్రజలు కరోనాతో పోరాడుతున్నారు. ఆక్సీజన్ షార్టేజ్ మేజర్ ఇష్యూ కాగా, అనేక మంది మరణానికి కారణమైంది. అయితే యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ మాత్రం ఆక్సిజన్ కొరత గురించి మెసేజ్ స్ప్రెడ్ చేస్తే వారి ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు. ఈ విషయమై స్పందించిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ‘అవును యూపీలో ఆక్సీజన్ కొరత ఉంది.. వీలైతే నా ప్రాపర్టీ అటాచ్ చేయండి చూద్దాం’ అని సవాల్ విసిరింది. ఈ క్రమంలో యోగీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై స్పందించిన సిద్ధార్థ్ ‘మంచి మానవుడు లేదా పవిత్రమైన వ్యక్తి లేదా నేత అనే తప్పుడు వాదనలు ఒక గట్టి చెంపదెబ్బను ఎదుర్కొంటాయి’ అని ట్వీట్ చేశాడు.

Next Story