మాల్దీవ్స్‌కు చెక్కేసిన బాలీవుడ్ లవ్ బర్డ్స్..

by  |
మాల్దీవ్స్‌కు చెక్కేసిన బాలీవుడ్ లవ్ బర్డ్స్..
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ డేటింగ్‌లో ఉన్నట్టు కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమ రిలేషన్‌షిప్‌ స్టేటస్ గురించి ఓపెన్‌గా ప్రకటించనప్పటికీ.. పలు సందర్భాల్లో వీరిద్దరూ జంటగా కనిపించడంతో ఫ్యాన్స్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేశారు. ఇదిలా ఉంటే సిద్ధార్థ్, కియారా న్యూ ఇయర్ వెకేషన్ కోసం మంగళవారం ముంబై నుంచి మాల్దీవ్స్ బయలుదేరారు. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడ్డ రూమర్డ్ లవ్ బర్డ్స్.. స్టైలిష్ అవుట్‌ఫిట్స్‌లో కనిపించారు.

కియారా కాజువల్ స్వెటర్ డ్రెస్‌‌లో, సిద్ధార్థ్ ఆలివ్ గ్రీన్ డెనిమ్-లెదర్ జాకెట్‌లో దర్శనమిచ్చారు. ఈ క్రమంలో ఫొటోగ్రాఫర్లకు పోజివ్వడం విశేషం. కాగా విష్ణువర్ధన్ డైరెక్షన్‌లో వచ్చిన ‘షేర్‌షా’ మూవీలో ఈ రూమర్డ్ కపుల్‌ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి మార్కులే పడగా.. మరోసారి జంటగా నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.



Next Story

Most Viewed