- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసుల అదుపులో ‘కర్ణాటక మాజీ సీఎం’
<p> కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షులు దినేష్ గుండు రావు, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం పోలీసు శాఖను దుర్వినియోగం చేయడాన్ని నిరసిస్తూ.. ర్యాలీగా వెళ్లి సీఎం బీఎస్ యడ్యూరప్ప కార్యాలయ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే సీఏఏ, ఎన్నార్సీలకు సంబంధించి ప్రధాని మోడీని కించపరుస్తూ బీదర్‌లో పాఠశాల విద్యార్థులతో ఓ నాటకం ప్రదర్శించిన […]</p>

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షులు దినేష్ గుండు రావు, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం పోలీసు శాఖను దుర్వినియోగం చేయడాన్ని నిరసిస్తూ.. ర్యాలీగా వెళ్లి సీఎం బీఎస్ యడ్యూరప్ప కార్యాలయ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే సీఏఏ, ఎన్నార్సీలకు సంబంధించి ప్రధాని మోడీని కించపరుస్తూ బీదర్‌లో పాఠశాల విద్యార్థులతో ఓ నాటకం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ నాటకానికి సహకరించినందుకు ఓ విద్యార్థి తల్లి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిపై నమోదు చేసిన దేశద్రోహం కేసుకు నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్ ఈ ర్యాలీని చేపట్టింది. కాగా పోలీసుల చర్యను కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య అప్రజాస్వామికమని అన్నారు. ‘మా హక్కులను హరించే అధికారం పోలీసులకు లేదని’ మండిపడ్డారు.






