- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లంచం తీసుకుంటూ ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన SI
by Batti.Sumithra |
<p>దిశ, పరిగి : గొడవ విషయంలో లంచం తీసుకుంటుండగా పరిగి ఎస్ఐ పాటిల్ క్రాంతి కుమార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన సాయి రెడ్డి, సురేష్ అనే వ్యక్తులు వారం రోజుల క్రితం గొడవ పడ్డారు. ఈ విషయమై స్థానికంగా పంచాయితీ పెట్టి ఇరువురూ రాజీ కుదుర్చుకున్నారు. ఈ గొడవ విషయం తెలుసుకున్న పరిగి ఎస్ఐ పాటిల్ క్రాంతి కుమార్.. […]</p>

X
దిశ, పరిగి : గొడవ విషయంలో లంచం తీసుకుంటుండగా పరిగి ఎస్ఐ పాటిల్ క్రాంతి కుమార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన సాయి రెడ్డి, సురేష్ అనే వ్యక్తులు వారం రోజుల క్రితం గొడవ పడ్డారు.
ఈ విషయమై స్థానికంగా పంచాయితీ పెట్టి ఇరువురూ రాజీ కుదుర్చుకున్నారు. ఈ గొడవ విషయం తెలుసుకున్న పరిగి ఎస్ఐ పాటిల్ క్రాంతి కుమార్.. తనకు 10వేలు లంచం ఇవ్వాలంటూ సాయిరెడ్డిని డిమాండ్ చేశారు. సాయిరెడ్డి ఈ విషయం గురించి తన బాబాయ్ పరశురామ్ రెడ్డికి తెలియజేశారు.
పథకం ప్రకారం ఏసీబీని ఆశ్రయించిన వీరు.. డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా ఎస్‌ఐని పట్టించారు. అనంతరం ఎస్ఐ క్రాంతి కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
Next Story






