మీసం మెలేసిన నాని.. ‘శ్యామ్‌ సింగరాయ్‌’కు గుడ్ ‌బై!

by  |
Shyam-Singha-Roy
X

దిశ, సినిమా : కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ హర్డిల్స్.. భారీ ఈదురు గాలులు, వర్షాలతో సెట్స్‌ పాడైపోవడం.. తదితర షూటింగ్ కష్టాలెదుర్కొన్న ‘శ్యామ్‌ సింగరాయ్‌’ ఎట్టకేలకు కంప్లీట్‌ అయింది. నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా వస్తున్న ఈ మూవీకి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయని చిత్రయూనిట్‌ తెలిపింది. కథ, కథనాలతో పాటు విజువల్‌‌గానూ వెండితెరపై అద్భుతంగా ఉండబోతుందని చెప్పింది. కాగా సినిమా కోసం నాని స్పెషల్‌ మేకోవర్‌ ప్రశంసలు అదుకుంటోంది.

ఇప్పటికే విడుదలైన నాని, సాయిపల్లవి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌కు సైతం ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ యూనిక్‌ స్టోరీతో చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. తెలుగు ఆడియన్స్‌కు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వనున్నారని మేకర్స్ తెలిపారు. కాగా మూవీ ఔట్‌పుట్‌ పట్ల టీమ్‌ మొత్తం హ్యాపీగా ఉందని నిర్మాత వెంకట్‌ బోయనపల్లి అన్నారు.

ఈ చిత్రంలో సాయిపల్లవితో పాటు మరో ఇద్దరు బ్యూటిఫుల్‌ హీరోయిన్స్‌ కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్‌ నటించారు. రాహుల్‌ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్‌ గోమఠం కీలక పాత్రలు పోషించారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.1గా రూపొందుతున్న చిత్రానికి సత్యదేవ్‌ జంగా కథ అందించగా.. మిక్కీ జే మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Next Story

Most Viewed