శుభ్‌మన్‌, సారా టెండుల్కర్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్?

by  |
శుభ్‌మన్‌, సారా టెండుల్కర్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్?
X

దిశ, స్పోర్ట్స్: ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో సెలెబ్రిటీల జీవితాలపై ఆసక్తి బాగా పెరిగిపోయింది. వాళ్లు ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎక్కడకు వెళ్తున్నారు? అంటూ ప్రతిక్షణం గమనిస్తూనే ఉంటారు. అలాంటిది ఇద్దరు సెలెబ్రిటీలు ఒకరిని ఒకరు ఫాలో అవడమే కాకుండా, ఒకేలా పోస్టులు పెడితే ఇక ఊరుకుంటారా? ప్రస్తుతం క్రికెటర్ శుభ్‌మన్ గిల్, సచిన్ కూతురు సారా టెండుల్కర్ గురించి సోషల్ మీడియాలో గాసిప్స్ మొదలయ్యాయి. వీరి మధ్య ఏదో ఉందనే రూమర్లు బయటకు వస్తున్నాయి. దీనికి కారణం వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టే. తాజాగా, శుభ్‌మన్‌ ఇన్‌స్టాలో ఓ అందమైన ఫొటో పోస్ట్‌ చేశాడు. మనోహరమైన ప్రదేశంలో బెంచ్‌పై కూర్చొని, కాలుమీద కాలువేసుకుని ఉన్నాడు. ఆ ఫోటోకు ‘ఐ‌ స్పై’ అని రాసి పక్కన రెండు కళ్ల ఎమోజీని పెట్టాడు. మరోవైపు సారా కూడా తన అందమైన ఫొటో పెట్టి ‘ఐ‌ స్పై’ అని పోస్ట్‌ చేయడమే కాకుండా అవే ఎమోజీలను పెట్టారు. దీంతో వారిని అనుసరిస్తున్న నెటిజన్లు ఇద్దరి మధ్య ఏదో జరుగుతున్నదని గుసగుసలాడుకుంటున్నారు. సారా, గిల్ ఇద్దరూ ఒకరి పోస్టులకు ఒకరు కామెంట్లు పెట్టుకోవడం, అభినందించుకోవడం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. దీంతో వీరి మధ్య ప్రత్యేక బంధం ఉందని నెటిజన్లు అంటున్నారు. అయితే, దీనిపై పూర్తి స్పష్టత రావాలంటే వీరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.


Next Story

Most Viewed