వర్చువల్ ఫ్యామిలీ నా ప్రపంచం : శ్రుతి

by  |
వర్చువల్ ఫ్యామిలీ నా ప్రపంచం : శ్రుతి
X

దిశ, వెబ్‌డెస్క్ : మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటుంది. పర్సనల్, కెరియర్ విషయాలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు సూపర్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చే శ్రుతి.. వర్చువల్ ఫ్యామిలీని పెంచుకుంది. తన యాటిట్యూడ్, ఫన్నీ పోస్ట్‌లతో అభిమానులతో తరచుగా మాట్లాడే శ్రుతి.. ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది.

కాగా తన వర్చువల్ ఫ్యామిలీ ఇంత బిగ్గెస్ట్ అయినందుకు హ్యాపీగా ఉందని తెలుపుతూ పోస్ట్ పెట్టింది శ్రుతి. ‘నా లైఫ్ గురించి మీతో షేర్ చేసుకోవడం.. మీ గురించి నేను తెలుసుకోవడం అదృష్టంగా ఫీల్ అవుతున్నా’ అని తెలిపింది. అభిమానుల ప్రేమ, దయ, అనుకూలతకు ధన్యవాదాలు తెలిపిన ఆమె.. వారే తన ప్రపంచమని చెప్పింది. బిగ్గెస్ట్ హగ్ ఇచ్చిన భామ.. క్రాక్ సినిమా సెట్ నుంచి థాంక్స్ పోస్ట్ పెట్టింది. ఈ సినిమాలో తనకు కొడుకుగా నటిస్తున్న మాస్టర్ సాత్విక్‌తో కలిసి ఫొటోలకు పోజిస్తూ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు ధన్యవాదాలు తెలిపింది.



Next Story

Most Viewed