శింబుతో శృతి రొమాన్స్

by  |
శింబుతో శృతి రొమాన్స్
X

బ్యూటిఫుల్ శృతి హాసన్‌కు గోల్డెన్ డేస్ వచ్చేసినట్లున్నాయి. కొన్ని రోజులుగా అటు బాలీవుడ్‌తో పాటు ఇటు సౌత్‌ను కవర్ చేస్తూ ఆల్మోస్ట్ స్టార్స్ అందరి సోషల్ మీడియా స్టేటస్ అయిపోయింది శృతి. ఆగస్ట్ 8న తన ‘ఎడ్జ్’ ఆల్బమ్ సూపర్ హిట్ కాగా.. తనను అప్రిషియేట్ చేస్తూ ట్విట్టర్, ఇన్‌స్టాలో శృతి వీడియోను షేర్ చేశారు. దీంతో శృతితో పాటు తన ఫ్యాన్స్ కూడా సూపర్ హ్యాపీగా ఉన్నారు.

కాగా శృతి అభిమానులకు కిక్ ఇచ్చే మరో న్యూస్ కోలీవుడ్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న శృతి.. ఈ మధ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించగా.. కొత్తగా కోలీవుడ్ సూపర్ హీరో శింబుతో కలిసి సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మిస్కిన్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు శృతి ఆల్రెడీ సైన్ చేసినట్లు కోలీవుడ్ టాక్. కాగా ఈ సినిమాలో శృతి.. శింబుకు లవర్‌గా కనిపించనుందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అయిన శృతి హిందీ చిత్రం ‘యారి’ అంతగా సక్సెస్ కాకపోయినా.. శృతి లుక్స్, యాక్టింగ్‌కు ప్రశంసలు అందుకుంది.

Next Story

Most Viewed