శృతి ఆల్బమ్ అదిరెన్ !

by  |
శృతి ఆల్బమ్ అదిరెన్ !
X

అందం, అభినయంతో పాటు సంగీత సామ్రాజ్యాన్ని ఏలగల టాలెంట్ శృతి హాసన్ సొంతం. హీరోయిన్‌గా ఎంట్రీకి ముందు తండ్రి కమల్ హాసన్ ‘ఈనాడు’ సినిమాకి మ్యూజిక్ అందించిన భామ.. ఆ తర్వాత చాలా సినిమాల్లో పాటలు కూడా పాడింది. హీరోయిన్‌గా ఎంత బిజీగా ఉన్నా సరే.. మ్యూజిక్ అంటే పడిచచ్చిపోయే శృతి సంగీతంపై తన కాన్సంట్రేషన్‌ను మాత్రం వీడలేదు. గతేడాది తనకు హీరోయిన్‌గా మంచి అవకాశాలు వచ్చినా, సినిమాలకు దూరంగా ఉంటూ సింగర్‌గా పలు దేశాల్లో చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చి గుర్తింపు తెచ్చుకుంది శృతి.

ఇక లాక్‌డౌన్‌లో దొరికిన ఖాళీ టైమ్‌ను చక్కగా వినియోగించుకున్న శృతి.. అదిరిపోయే ఆల్బమ్ చేసింది. ఆగస్ట్ 8న సర్‌ప్రైజ్ ఇస్తానని చెప్పిన తను.. ఇచ్చిన మాట ప్రకారం ‘ఎడ్జ్’ అనే ఆల్బమ్ రిలీజ్ చేసి అభిమానులకు సూపర్ ట్రీట్ ఇచ్చింది. తానే రాసి, కంపోజ్ చేసి, పర్‌ఫామ్ చేసిన ఈ ఆల్బమ్‌కు భారీ కాంప్లిమెంట్స్ అందుకుంటోంది శృతి. విధ్వంసం పునర్నిర్మాణానికి దారితీస్తుందన్న కాన్సెప్ట్‌తో వచ్చిన ఆల్బమ్.. వీహెచ్1లో ప్రసారమవుతోంది.

కాగా ఈ సందర్భంగా ఆల్బమ్ కో ప్రొడ్యూసర్ కరణ్ పారిక్ కు, ఆల్బమ్ డైరెక్ట్ చేసిన చిన్మయికి స్పెషల్ థాంక్స్ చెప్పారు శృతి.

https://www.instagram.com/p/CDnkyK0hk9h/?igshid=wvceqhxymnzr

Next Story

Most Viewed