- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థియేటర్‌కు ఆటోలో వచ్చిన స్టార్ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఒకప్పుడు టాలీవుడ్‌ను ఊర్రూతలు ఊగించిన హీరోయిన్‌లలో శ్రియ ఒకరు. అగ్రహీరోల అందరి సరసన నటించింది. స్టార్ హీరోయిన్‌గా శ్రియకు మంచి పేరుంది. చాలా రోజుల తర్వాత శ్రియ మళ్లీ తెలుగు వెండి తెరపై సందడి చేయనుంది. కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న శ్రియ గమనం సినిమాతో మళ్ళీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, 3 ఎమోషన్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో శ్రియ, నిత్యామీనన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : ఒకప్పుడు టాలీవుడ్‌ను ఊర్రూతలు ఊగించిన హీరోయిన్‌లలో శ్రియ ఒకరు. అగ్రహీరోల అందరి సరసన నటించింది. స్టార్ హీరోయిన్‌గా శ్రియకు మంచి పేరుంది. చాలా రోజుల తర్వాత శ్రియ మళ్లీ తెలుగు వెండి తెరపై సందడి చేయనుంది. కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న శ్రియ గమనం సినిమాతో మళ్ళీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, 3 ఎమోషన్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో శ్రియ, నిత్యామీనన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇందులో శ్రియ వినికిడి లేని అమ్మాయిగా ఓ మురికి వాడలో దుబాయికి వెళ్లిన తన భర్త కోసం చంటి బిడ్డతో ఎదరు చూస్తూ ఉంటుంది. డిసెంబర్ 10న రిలీజ్ అయిన ఈ సినిమాలో శ్రియ మంచి మార్కులే పడుతున్నాయి.
తాజాగా ఈ సినిమాను చూడటానికి శ్రియ హైదరాబాద్‌లోని మల్లికార్జున థియేటర్‌కు వచ్చింది. అయితే అందరిలా కారులో రాకుండా ఈ అమ్మడు ఆటోలో రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. స్టార్ హీరోయిన్ అయి ఉండి ఆటోలో రావడం ఏంటని గుసగుసలాడుకున్నారు. శ్రియ ఆటోలో రావడంతో ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె ప్రేక్షకులతో కలసి సినిమా చూసి వెళ్లిపోయారు. శ్రియ రాకతో థియేటర్ మొత్తం తన అభిమానులతో సందడిగా మారింది.






