- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాహో భామ అడ్వెంచర్
<p>సాహో భామ శ్రద్ధ కపూర్ అందానికి దాసోహం కావాల్సిందే. డ్యాన్స్, యాక్టింగ్, సింగింగ్ అన్నిట్లోనూ బెస్ట్ అనిపించుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ.. సాహో సినిమాతో తెలుగు కుర్రాళ్ల గుండెలు కొల్లగొట్టింది. అయితే రెండు నెలలుగా లాక్ డౌన్ లో ఉన్న శ్రద్ధ.. ప్రకృతి, తోటి మూగ జీవుల పట్లతో మనిషి ఎలా ఉండాలో సూచించింది. మనం ప్రకృతికి సరెండర్ అవ్వాలే తప్పా.. ప్రకృతిని మనకు సరెండర్ చేసుకోవద్దని.. అలా చేయడం వల్లే కరోనా కారణంగా ఇలాంటి దుర్భర […]</p>

సాహో భామ శ్రద్ధ కపూర్ అందానికి దాసోహం కావాల్సిందే. డ్యాన్స్, యాక్టింగ్, సింగింగ్ అన్నిట్లోనూ బెస్ట్ అనిపించుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ.. సాహో సినిమాతో తెలుగు కుర్రాళ్ల గుండెలు కొల్లగొట్టింది. అయితే రెండు నెలలుగా లాక్ డౌన్ లో ఉన్న శ్రద్ధ.. ప్రకృతి, తోటి మూగ జీవుల పట్లతో మనిషి ఎలా ఉండాలో సూచించింది. మనం ప్రకృతికి సరెండర్ అవ్వాలే తప్పా.. ప్రకృతిని మనకు సరెండర్ చేసుకోవద్దని.. అలా చేయడం వల్లే కరోనా కారణంగా ఇలాంటి దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయని క్లాస్ కూడా పీకింది. పుస్తకాలు చదవడం వల్ల కలిగే లాభాలు వివరిస్తూ.. లాక్ డౌన్ లో బుక్స్ తెగ చదివేసింది కూడా.
https://www.instagram.com/p/CAt_-MgFj3F/?utm_source=ig_web_copy_link
అయితే లాక్ డౌన్ సడలింపుతో ఓ ఫన్నీ వర్క్ చేశాను అంటూ… సోదరుడు సిద్ధాంత్ కపూర్ తో కలిసి సూపర్ మార్కెట్ కు వెళ్లిన ఫోటో షేర్ చేసింది. దీన్ని ఒక అడ్వెంచర్ గా భావిస్తూ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. ఇక తోబుట్టువులతో షాపింగ్ వెళ్తే చాలా ఫన్ ఉంటుంది అంటున్నాడు. కానీ చాలా దగ్గరగా ఉంటున్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది తప్పదు అని..అలవాటు చేసుకోవాలని చెప్తున్నారు..






