కేసీఆర్‌కు షాక్.. టీఆర్ఎస్‌‌కు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ గుడ్ బై

231
Gattu Ramachandra Rao

దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు.. పార్టీలో సమూచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.. ఆరేళ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేశారు. పార్టీ కార్యవర్గంలో అవకాశం కల్పించారు. కానీ ఎలాంటి నామినేటెడ్ గానీ మరే ఇతర పదవి అయినా ఇవ్వక పోవడంతో మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేశారు టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ గట్టు రామచంద్రారావు. పార్టీ కార్యాలయానికి వెళ్లి గురువారం తెలంగాణ భవన్ సెక్రటరీకి రాజీనామా లేఖను అందజేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ లకు సైతం వాట్సాప్ లో రాజీనామాను పంపారు.

‘నేను మీ అభిమానం పొందడంలో, గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని భావించాను. అందుకే పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. ఆమోదిస్తారని ఆశిస్తున్నాను’ అని రాజీనామా లేఖలో గట్టు రామచంద్రారావు పేర్కొన్నారు.

2015లో టీఆర్ఎస్ చేరి నేటి వరకు పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన రాజకీయ అనుభవాన్ని గుర్తించిన కేసీఆర్… రాష్ట్ర కమిటీలో పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించారు. గట్టు సీపీఎం, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీలో పనిచేశారు. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తారని భావించినప్పటికీ అధిష్టానం అవకాశం ఇవ్వక పోవడంతో మనస్తాపంతో పార్టీకి రాజీనామా చేసినట్లు గట్టు పేర్కొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..