ఆయన లేరంటే నమ్మలేకపోతున్నాను : శోభన

by  |
ఆయన లేరంటే నమ్మలేకపోతున్నాను : శోభన
X

దిశ, వెబ్‌డెస్క్: ‘జీవితమే ఓ ఆట.. సాహసమే పూబాట’ అనే పాటను ఎస్పీబీయే పాడారు. కానీ ‘నీ జీవితమే ఓ పాట.. సాహసమే నీ పాటలపూదోట’ అని ప్రతి అభిమాని ప్రతిరోజూ అనుకుంటున్నారు. ఆ గాన గంధర్వుడు ఈ లోకాన్ని వదిలి వెళ్లాడంటే.. ఎవరికీ నమ్మబుద్ధి కావడం లేదు. ఏ పరధ్యానంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఆయన మాటైనా లేదా పాటైనా మన చెవులకు తాకగానే.. ఎస్పీబీ రూపం మన ముందు కనిపించేది. అంతగా ఆయన ప్రతీ ఒక్కరి జీవితంలో మమేకమయ్యారు. అందుకే భారతీయులంతా ఆయనను స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ నటి శోభన.. ఎస్పీబీని గుర్తు చేసుకున్నారు.

నటి శోభన.. రజనీకాంత్‌తో కలిసి నటించిన చిత్రానికి ఎస్పీబీ పాడిన పాటను పోస్ట్‌ చేస్తూ ఆ మధుర గాయకుడిని గుర్తు చేసుకుంది. ‘ఎస్పీబీ పాడిన పాటను పోస్ట్‌ చేసేందుకు వెతుకుతుండగా ఆయన లేరనే విషయన్ని నమ్మలేకపోయా.. అలాంటి గొప్ప వ్యక్తి స్థానాన్ని ఇంకెవరూ భర్తీ చేయలేరు. మనం ఓ అద్భుత నిధిని కోల్పోయాం. నేను, ఆయన కలిసి నటించాం కూడా. ఆయనది పోలీస్ క్యారెక్టర్ అయితే.. ఆ మూవీలో నేను ఓ దొంగ పాత్రధారిని. చాలా సరదా మనిషి. ఎంతో స్వచ్ఛమైన వ్యక్తిత్వం ఆయనది. పాటలే ఆయన లోకం’ అని ఎంతో భావోద్వేగంతో శోభన ఈ పోస్ట్ చేసింది.

https://www.instagram.com/p/CF3g1g5g_zU/

Next Story

Most Viewed