- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'టక్ జగదీష్' రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ.. నానికి ఇష్టం లేకుండానే..?
<p>దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’ ఓటీటీ రిలీజ్ కన్ ఫర్మ్ అయింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను డిజిటల్ ప్లాట్ ఫామ్ లోనే రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. డిసెంబర్ లోనే సినిమా పూర్తి అయిందని, సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిందన్నారు. ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితులే కొనసాగుతుండటంతో థియాట్రికల్ రిలీజ్ స్కిప్ చేస్తున్నట్లు నోట్ రిలీజ్ చేశారు. […]</p>

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’ ఓటీటీ రిలీజ్ కన్ ఫర్మ్ అయింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను డిజిటల్ ప్లాట్ ఫామ్ లోనే రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. డిసెంబర్ లోనే సినిమా పూర్తి అయిందని, సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిందన్నారు.
ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితులే కొనసాగుతుండటంతో థియాట్రికల్ రిలీజ్ స్కిప్ చేస్తున్నట్లు నోట్ రిలీజ్ చేశారు. హీరో నానికి తమ నిర్ణయం తెలపగా.. తను కూడా నిర్మాతలుగా తమ కష్టాలను అర్థం చేసుకుని ఇందుకు ఓకే చెప్పారన్నారు. డైరెక్టర్ శివ నిర్వాణ కూడా ఈ విషయంలో తమకు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఫిల్మ్ మేకింగ్ పట్ల ఎప్పుడూ ఫ్యాషనేట్ గా ఉండే తాము.. ‘టక్ జగదీష్’ వంద శాతం ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేస్తామని ప్రామిస్ చేశారు.
#TuckJagadish pic.twitter.com/7cxE9GC2Pu
— Shine Screens (@Shine_Screens) August 22, 2021
- Tags
- nani
- ott release






