భర్త అరెస్ట్ తర్వాత.. తొలిసారి షూటింగ్‌లో శిల్పా శెట్టి

by  |
shilpa-shetty
X

దిశ, సినిమా : భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు ఇష్యూ తర్వాత శిల్పా శెట్టి తొలిసారిగా సూపర్ డ్యాన్స్ షో‌కు హాజరైంది. రెడ్ అండ్ స్కై బ్లూ కలర్‌ శారీలో కనిపించిన శిల్ప.. వానిటీ వ్యాన్ నుంచి మీడియాకు హాయ్ చెప్తూ సెట్‌లో జాయిన్ అయ్యేందుకు వెళ్లిపోయింది. కాగా తనతో ఇన్నాళ్లు టచ్‌లో ఉన్న సూపర్ డ్యాన్స్ షో యూనిట్.. ఆమెకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పినట్లు తెలుస్తోంది. కాగా శిల్ప తన ఫ్యామిలీ కోసం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కమ్ బ్యాక్ ఇచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇక ఈ షోకు మరో జడ్జిగా వ్యవహరిస్తున్న అనురాగ్ బసు.. సెట్‌లో శిల్పను చాలా మిస్ అయినట్లు తెలిపాడు. ఈ కార్యక్రమంలో భాగమైన ప్రతీ ఒక్కరితో మంచి అనుబంధం ఉందని.. కంటెస్టెంట్స్, కొరియోగ్రాఫర్స్‌తో పాటు షోకు సంబంధించిన ప్రతీ ఒక్కరం చిన్న కుటుంబంగా మారిపోయామని వివరించాడు. అలాంటప్పుడు కుటుంబంలో ఒకరు లేకుండా పోతే చాలా కష్టంగా ఉంటుందని చెప్పాడు.


Next Story

Most Viewed