ఏంటక్కా ఇది.. బావ గురించి తెలియదా? : షెర్లిన్

101

దిశ, సినిమా : హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా శిల్పా శెట్టిపై ఫైర్ అయింది. శిల్పా భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో తాజాగా సప్లిమెంటరీ చార్జ్ షీట్ ఫైల్ కాగా దీనిపై మీడియా ప్రశ్నించింది. ఈ విషయంపై రియాక్ట్ అయిన ఆమె.. తన ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నానని, రాజ్ కుంద్రా ఏం చేస్తున్నాడో తనకు తెలియదని సమాధానం ఇచ్చింది. దీంతో ఈ కేసులో స్టేట్‌మెంట్ ఇచ్చిన షెర్లిన్ చోప్రా ట్విట్టర్ వేదికగా శిల్పాను విమర్శించింది. ‘కొన్ని నివేదికల ప్రకారం, తన భర్త దుర్మార్గపు కార్యకలాపాల గురించి తెలియదని దీదీ చెబుతోంది. కుంద్రా ఆస్తుల గురించి కూడా తెలియదని అంటోంది. ఈ ప్రకటన ఎంతవరకు నిజం, మీరు అర్థం చేసుకోగలరు కదా’ అంటూ సెటైర్లు వేసింది. చేతిలో డంబెల్స్‌తో ఎక్సర్‌సైజ్ చేస్తూనే శిల్పాను కామెంట్ చేసిన షెర్లిన్‌పై జోక్స్ వేసుకుంటున్నారు నెటిజన్లు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..