డ్రాయర్ విప్పమన్న డైరెక్టర్.. చెంప చెల్లుమనిపించిన యాక్ట్రెస్

by  |
Sharon Vonne Stone
X

దిశ, సినిమా : అమెరికన్ యాక్ట్రెస్, ప్రొడ్యూసర్ షరాన్ స్టోన్.. ఫ్యాషన్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించి నటిగా స్థిరపడింది. టెలివిజన్ షోస్‌లో సత్తా చాటుతూ ఎమ్మీ, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు సైతం అందుకుంది. ఈ క్రమంలో తన సినీ జీవిత అనుభవాలను పంచుకోవాలనే ఉద్దేశంతో ‘ద బ్యూటీ ఆఫ్ లివింగ్ ట్వైస్ (The Beauty Of living Twice)’ అనే పుస్తకాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు కెరీర్‌లో తాను ఎదుర్కొన్న అవమానాలు, అద్భుత సంఘటనలను ఈ పుస్తకంలో ప్రస్తావించిన షరాన్.. 1992లో వచ్చిన ‘బేసిక్ ఇన్‌స్టింక్ట్’ అనే సినిమా డైరెక్టర్‌ను తాను చెంపదెబ్బ కొట్టినట్లు పేర్కొంది.

ఆ సినిమాకు సంబంధించిన ఓ సీన్ చిత్రీకరణ సందర్భంగా తనను బోల్డ్‌గా పర్ఫార్మ్ చేయమనడంతో అందుకు ఒప్పుకున్నానని తెలిపిన షరాన్.. మొదట వైట్ అండ్ వైట్ దుస్తుల్లో ఎక్స్‌పోజ్ చేయాలని చెప్పగా, తను అలాగే పర్ఫార్మ్ చేసినట్లు చెప్పింది. అయితే ఆ సీన్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన డైరెక్టర్.. ఏమీ కనిపించడం లేదని, లోదుస్తులు (డ్రాయర్) కూడా తీసేస్తేనే అనుకున్న విధంగా ‘వెజీనా షాట్’ తీయగలనని తనకు చెప్పాడని, దీంతో ఆ డైరెక్టర్ చెంప చెల్లుమనిపించి అక్కడ నుంచి వెళ్లిపోయానని వివరించింది షరాన్.


Next Story