నెటిజన్స్ ఫైర్.. కేటీఆర్‌ ఎవరో తెలియకుండానే విషెస్ చెప్పావా షర్మిలక్కా..?

by Shyam |   (  Updated:2021-07-24 01:01:06  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. అంతేకాకుండా కేటీఆర్‌కు భగవంతుడు ఆయురారోగ్యాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలను భర్తీ చేసే పట్టుదల ఇవ్వాలని తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపే హృదయాన్ని ఇవ్వాలని ట్వీట్ చేశారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా 54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని, [&hellip;]</p>

నెటిజన్స్ ఫైర్.. కేటీఆర్‌ ఎవరో తెలియకుండానే విషెస్ చెప్పావా షర్మిలక్కా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. అంతేకాకుండా కేటీఆర్‌కు భగవంతుడు ఆయురారోగ్యాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలను భర్తీ చేసే పట్టుదల ఇవ్వాలని తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపే హృదయాన్ని ఇవ్వాలని ట్వీట్ చేశారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా 54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని, విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చే మనసు ఇవ్వాలని కోరుకుంటున్నానని ఆమె ట్వీట్ చేశారు.

మంత్రిగా కేటీఆర్ బాధ్యతలను గుర్తు చేసేందుకు చిన్న వీడియోను కానుకగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో తన చదువుల కోసం తల్లిదండ్రులకు భారం కాకూడదని వనపర్తి జిల్లాకు చెందిన లావణ్య అనే ఇంజినీరింగ్ యువతి ఆత్మహత్యకు సంబంధించిన వీడియోను పెట్టారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా వుండగా మొన్నటి వరకు కేటీఆర్ ఎవరో తెలియదని చెప్పిన షర్మిలకు ఇప్పుడు ఎలా తెలిశారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Next Story