బతుకమ్మ సంబురాల్లో షర్మిల

102

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రకృతి పండుగ బతుకమ్మ అని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఈ పండుగ అని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని హియాత్ సాగర్ వద్ద నిర్వహిస్తున్న సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రకృతిలోని రంగురంగుల పువ్వులతో గౌరీదేవిని పూజిస్తూ తెలంగాణ మహిళలు గొప్పగా నిర్వహించుకునే పండుగ బతుకమ్మ అన్నారు. మహిళలంతా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, భవిష్యత్ లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. మహిళలందరికి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలతో ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..