Shanaya Kapoor బెల్లీ డ్యాన్స్.. నెటిజన్ల హాట్ కామెంట్స్

by  |
Shanaya-Kapoor
X

దిశ, సినిమా : యాక్టర్ – ఫిల్మ్ మేకర్ సంజయ్ కపూర్ డాటర్ షనయా కపూర్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనలో సూపర్ స్టార్ అయ్యే లక్షణాలు ఉన్నాయని రుజువు చేసేందుకు ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. సోషల్ మీడియాలో హాట్ అండ్ క్యూట్ ఫొటో షూట్స్, డ్యాన్సింగ్ వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్స్ అటెన్షన్ క్యాచ్ చేయడంలో సక్సెస్ అవుతోంది.

ఈ క్రమంలోనే ఈ మధ్య అభిమానులతో ‘కథక్’ డ్యాన్స్ క్లిపింగ్స్ పంచుకుని ఇంప్రెషన్ కొట్టేసిన భామ.. తాజాగా బెల్లీ డ్యాన్స్ వీడియో షేర్ చేసింది. తన ఇన్‌స్ట్రక్టర్‌తో రిహార్సల్స్‌ సెషన్‌కు సంబంధించిన వీడియో షేర్ చేసిన షనయ.. ఈ విధంగా కొరియోగ్రఫీ నేర్చుకుంటున్నట్లు చెప్పింది. ఈ పోస్ట్‌పై స్పందించిన అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా.. షనయ డ్యాన్సింగ్ మూమెంట్స్ చూస్తుంటే తనకు కడుపు నొప్పి వస్తుందని, అంత హార్డ్ మూమెంట్స్‌ను అందంగా, అవలీలగా చేసేసిందని కాంప్లిమెంట్స్ ఇచ్చింది.

Next Story