- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షార్జాలో శంషాబాద్ వాసి మృతి
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్‌కు చెందిన ఫర్నీచర్ వ్యాపారి మహ్మద్ అసద్(45) కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలో భాగంగా గత నెలలో దుబాయికి వెళ్లారు. అక్కడ ఉన్న బంధువులతో సంతోషంగా గడిపి ఈ నెల 5న స్వదేశానికి రావడానికి టికెట్లు తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో కారులో రాత్రి షార్జా విమానాశ్రయానికి బయలుదేరారు. దారిలో కారు అదుపు తప్పి విభాగిని, విద్యుత్తు స్తంభాన్ని ఢీకొంది. డ్రైవర్ సీటు పక్కన కూర్చున్న మహ్మద్ అసద్ అక్కడికక్కడే మృతి చెందారు. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్‌కు చెందిన ఫర్నీచర్ వ్యాపారి మహ్మద్ అసద్(45) కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలో భాగంగా గత నెలలో దుబాయికి వెళ్లారు. అక్కడ ఉన్న బంధువులతో సంతోషంగా గడిపి ఈ నెల 5న స్వదేశానికి రావడానికి టికెట్లు తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో కారులో రాత్రి షార్జా విమానాశ్రయానికి బయలుదేరారు.
దారిలో కారు అదుపు తప్పి విభాగిని, విద్యుత్తు స్తంభాన్ని ఢీకొంది. డ్రైవర్ సీటు పక్కన కూర్చున్న మహ్మద్ అసద్ అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న భార్య, పిల్లలు, బంధువులు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లారేసరికి శంషాబాద్‌కు చేరుకుంటామని ఫోన్ లో సమాచారం ఇచ్చిన అసద్ మృతి చెందడం, కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదం బారిన పడడంతో శంషాబాద్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. గతంలో ఆయన టీఆర్ఎస్ మైనార్టీ సెల్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు, తర్వాత కాంగ్రెస్‌లో చేరారు.
Next Story






