సెక్స్ వర్కర్స్‌తో నటుడు.. రెడ్ లైట్ ఏరియాలో వీడియో

by  |
Shalin-Bhanot
X

దిశ, సినిమా : ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా మంచి గుర్తింపు పొందిన యాక్టర్ షాలిన్ భానోత్ సెక్స్ వర్కర్స్‌కు అండగా నిలిచాడు. ముంబై రెడ్ లైట్ ఏరియాలో పర్యటించిన ఆయన.. కామాతిపురలోని సెక్స్‌వర్కర్స్‌కు డెలీ నీడ్స్ అందించాడు. కరోనా కారణంగా ఏడాదిగా తిండిలేకుండా పస్తులుంటున్న 1300కు పైగా కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, మాస్క్‌లు, సానిటేషన్ ప్రొడక్ట్స్ పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన భానోత్.. లాక్ డౌన్ వల్ల సెక్స్ వర్కర్స్ ఎలాంటి ఉపాధి పొందలేకపోతున్నారని, దురదృష్టవశాత్తు వీరి గురించి మనలో చాలా మంది ఆలోచించే పరిస్థితుల్లో లేరని అభిప్రాయపడ్డాడు.

ఓ సామాజిక కార్యకర్త వల్ల కామాతిపురలోని ఇబ్బందులు తెలుసుకున్నానన్న భానోత్.. ఈ ప్రాంతంలోని సెక్స్ వర్కర్స్ భయానక జీవనపరిస్థితులను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నాడు. అన్ని వర్గాల నుంచి సహాయం పొందేందుకు వారు అర్హులన్న నటుడు.. వీలైనంతం సాయం చేయాలని కోరాడు.



Next Story

Most Viewed