‘శాకుంతలం’ మోషన్ పోస్టర్ రిలీజ్

by  |
‘శాకుంతలం’ మోషన్ పోస్టర్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్ :
‘ఉదయం వర్షంలో ఆకులు, గడ్డి తడిసినట్లుగా.. పొగమంచు ప్రతీ దృష్టిని కప్పివేస్తుంది. మేఘాలు మన మనస్సులను కదిలిస్తాయి. అలాగే ప్రేమ కథలు మన హృదయాలను స్వాధీనం చేసుకుంటాయి..’ అంటూ అత్యంత అద్భుత ప్రేమ కథాపురాణం ‘శాకుంతలం’ టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు దర్శకులు గుణ శేఖర్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌‌పై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. కాగా ఈ ఎపిక్ లవ్ స్టోరీకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

‘ప్రేమను మరిచిపోయినా.. ఆ మరపురాని ప్రేమ కథ మిగిలే ఉంది’ అంటూ ‘శాకుంతలం’ టైటిల్ రిలీజ్ కాగా.. మణిశర్మ, గుణ శేఖర్ కాంబినేషన్ పర్‌ఫెక్ట్ అంటున్నారు ఫ్యాన్స్. 53 సెకన్లున్న బ్లాక్ అండ్ వైట్ మోషన్ పోస్టర్ విజువల్ ట్రీట్‌గా ఉండగా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని చెప్తున్నారు.
ఇక శకుంతల పాత్రకు అనుష్క శెట్టి, సమంత అక్కినేని బెస్ట్ చాయిస్ అని సజెషన్స్ ఇస్తున్నారు ఆడియన్స్.

Next Story

Most Viewed