అమ్మాయిలూ.. నా లాగా మోసపోవద్దు : షకీలా

by  |
అమ్మాయిలూ.. నా లాగా మోసపోవద్దు : షకీలా
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇన్‌స్పిరేషనల్ అండ్ మోటివేషనల్ స్టోరీస్‌కు కొంచెం డ్రామా మిక్స్ చేసి, బిగ్ స్క్రీన్‌పై ఆవిష్కరిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో వచ్చిన ఎన్నో బయోపిక్స్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. ఇప్పుడు షకీలా బయోపిక్‌తో వచ్చేస్తుంది బాలీవుడ్. రిచా చద్దా టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సినిమాలో పంకజ్ త్రిపాఠి ప్రధానపాత్రలో కనిపించబోతుండగా, ఈ సినిమాపై శృంగార తార షకీలా స్పందించారు.

రిచా చద్దా అమేజింగ్ పర్ఫార్మెన్స్‌కు కాంప్లిమెంట్స్ ఇచ్చిన షకీలా.. బతికుండగానే తనపై సినిమా రావడం ఆనందంగా ఉందని తెలిపింది. ప్రతీ ఒక్కరి లైఫ్‌లో బాధలుంటాయని, తను చాలా కష్టపడ్డా దక్కాల్సిన గౌరవం దక్కలేదని వాపోయింది. తన లాగా ఎవరూ మోసపోకూడదని ప్రజెంట్ జనరేషన్ అమ్మాయిలకు, హీరోయిన్లకు సూచించిన ఈ మల్లూవుడ్ స్టార్.. షకీలా చిత్రం మహిళలకు గుడ్ మెసేజ్ ఇస్తుందని అభిప్రాయపడింది. కాగా ఇంద్రజిత్ లంకేశ్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది.



Next Story