దుబాయ్ రోడ్లపై షారుఖ్ ఫైటింగ్

by  |
దుబాయ్ రోడ్లపై షారుఖ్ ఫైటింగ్
X

దిశ, సినిమా : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. దీపికా పదుకొనే, జాన్ అబ్రహం ప్రధానపాత్రల్లో కనిపించబోతున్న సినిమా 2022లో రిలీజ్ కానుండగా.. దుబాయ్ బుర్జ్ ఖలీఫాపై యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరగనుందనే న్యూస్ ఇప్పటికే స్ప్రెడ్ అయింది. అయితే బుర్జ్ ఖలీఫా కాదు కానీ, దుబాయ్ రోడ్లపై జరుగుతున్న ‘పఠాన్’ షూటింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో జీప్‌పై ఫైట్ సీన్ జరుగుతుండగా.. మూవింగ్‌ కారుపై అపోనెంట్‌కు షారుఖ్ పంచ్‌లిస్తున్నాడు. ఇక మరో కారు వారిని ఫాలో అవుతూ చిత్రీకరణ చేస్తుంది. ఈ వీడియో చూసి మురిసిపోతున్న షారుఖ్ ఫ్యాన్స్.. ‘షారుఖ్ బ్యాక్ విత్ బ్యాంగ్’ అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచే షూటింగ్ ప్రారంభం అవుతుండగా.. జనవరి చివరి నుంచే షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైందని సమాచారం.

https://twitter.com/I_AM_DEBESH/status/1354529902955909121?s=20

కాగా ఈ వీడియోస్‌లో షారుఖ్ యాక్షన్ సీక్వెన్స్‌కు ముందు తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా పోస్ట్ చేశారు ఫ్యాన్స్. సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్న సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.

Next Story