‘జెర్సీ’ కోసం రక్తం చిందించిన హీరో.. ఎన్ని కుట్లు పడ్డాయో తెలిస్తే.. (వీడియో)

by  |
jesey
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రస్తుతం రీమేక్‌ల దృష్టి పెట్టాడు. ఇటీవల ‘అర్జున్ రెడ్డి’ సినిమా రేమేక్‌తో భారీ హిట్ అందుకున్న షాహిద్ ఇప్పుడు మరో రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. తెలుగులో నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని షాహిద్ నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే ఈ సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశాడు. అయితే ఈ సినిమా విడుదలకు సిద్దమైన సందర్భంగా షాహిద్ ఓ మేకింగ్ వీడియోను షేర్ చేశాడు. అందులో సినిమా కోసం షాహిద్ రక్తం చిందిస్తూ మనకు కనిపిస్తాడు.

క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం షాహిద్ క్రికెట్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఈ క్రమంలో బాల్ షాహిద్ పెదవికి తగిలింది. దాంతో పెదవి చిట్లిపోయింది. దాదాపు 25 కుట్లు పడ్డాయని షాహిద్ తెలిపాడు. ఈ వీడియో ప్రమాదం జరిగిన వెంటనే షాహిద్ రక్తం ఊయడం, అతడి షర్ట్ పైన రక్తపు మరకలను మనం చూడొచ్చు. ఈ వీడియోను చూసిన అభిమానులంతా షాహిద్ డెడికేషన్‌కు నోరెళ్లబెడుతున్నారు. సినిమా పక్కా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.Next Story