హీరో భార్య సరికొత్త లుక్.. పైకి మాత్రమే చూడాలంటోంది!

by  |
Shahid kapoor
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ బ్యూటిఫుల్ కపుల్స్‌లో షాహిద్ కపూర్ – మీరా రాజ్‌పుత్ ఒకరు. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే ఈ జంట.. అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్స్ ఇస్తుంటారు. ఈ క్రమంలో మీరా స్వెట్‌ షర్ట్‌పై ఇంద్రధనస్సు చారలు కలిగి ఉన్న పిక్ పంచుకోగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. లేత నీలి రంగు స్వెట్‌షర్ట్‌లో మ్యాచింగ్ బాటమ్‌ ధరించి నవ్వుతూ కనిపించిన మీరా.. ఈ పోస్ట్‌కు లెజెండరీ కమెడియన్ చార్లి చాప్లిన్ కొటేషన్ యాడ్ చేసింది.

‘మీరు కిందకు చూస్తూ బతికినంత కాలం ఇంద్రధనస్సు ఎప్పటికీ కనిపించదు’ అని చెప్పింది. ఈ లుక్ చూసి ఫిదా అవుతున్నట్లు తెలిపిన షాహిద్.. ‘ఇది నిజమే.. మేము పైకి చూడటమే మంచిది’ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఇటీవల షాహిద్‌ అప్ కమింగ్ ఫిల్మ్ ‘జెర్సీ’ ట్రైలర్‌ గురించి మాట్లాడుతూ.. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2021 డిసెంబర్ 31న విడుదల కానుంది.


Next Story

Most Viewed