షాహిద్ వైఫ్ మెమొరబుల్ పిక్

by  |
షాహిద్ వైఫ్ మెమొరబుల్ పిక్
X

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్.. తాజాగా అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం నాని జెర్సీ సినిమా రీమేక్ చేస్తున్న షాహిద్.. కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోవడంతో ఇంటి పట్టునే ఉంటున్నారు. లాక్ డౌన్ వల్ల భార్య, పిల్లలతో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. కానీ బయట ప్రపంచాన్ని మిస్ అవుతునే ఉన్నారు. ఈ క్రమంలో షాహిద్ సతీమణి మీరా రాజ్ పూత్ గతంలో తన పుట్టినరోజు ఎలా జరిగిందో తెలుపుతూ ఓ మెమొరబుల్ పిక్ షేర్ చేసింది.

తన రెండో బిడ్డకు జన్మనిచ్చిన మీరా హాస్పిటల్ లో ఉండగా తన బర్త్ డే పార్టీ చేశాడట షాహిద్. సెప్టెంబర్ 5న జియాన్ జన్మించగా.. సెప్టెంబర్ 7న మీరా పుట్టినరోజు కావడంతో ఆస్పత్రిలోనే తన జన్మదిన వేడుకలు జరిపాడట షాహిద్. రెండు రోజుల వయసున్న జియాన్ సమక్షంలో ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడో తెలియని భర్త తన పుట్టినరోజు జరిపారని క్యాప్షన్ జత చేస్తూ పోస్ట్ పెట్టింది మీరా. కాగా ఈ మోస్ట్ లవెబుల్ పిక్ సోషల్ మీడియా లో వైరల్ అయింది.

Next Story

Most Viewed