హిందీ 'జెర్సీ' షూటింగ్ వాయిదా

by  |
హిందీ జెర్సీ షూటింగ్ వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్‌’తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో షాహిద్‌కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. బాలీవుడ్ క్రేజీ స్టార్ అయిపోయాడు. దీంతో తన తర్వాత సినిమా కూడా టాలీవుడ్ మూవీనే ఎంచుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నాడు. హిందీలోనూ గౌతమ్ తిన్ననూరి ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా… అల్లు అరవింద్, అమన్ గిల్, దిల్ రాజు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. అయితే దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో… జెర్సీ రీమేక్ షూటింగ్‌కు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించాడు షాహిద్. తద్వారా చిత్ర యూనిట్ సభ్యులు తమ ఇళ్లలో జాగ్రత్తగా, క్షేమంగా ఉంటారని అన్నాడు. ఫ్యామిలీనీ సేఫ్‌గా ఉంచాలని సూచించాడు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతీ ఒక్కరు బాధ్యతగా ప్రవర్తించాలని కోరారు.

Tags: Jersey, Bollywood, Shahid Kapoor, Suspension Of Shooting, Kabir Singh, Nani

Next Story

Most Viewed