స్నేహం ముసుగులో కమిట్‌మెంట్.. హీరోయిన్స్‌తో వారి వెకిలి చేష్టలు

by  |
స్నేహం ముసుగులో కమిట్‌మెంట్.. హీరోయిన్స్‌తో  వారి వెకిలి చేష్టలు
X

దిశ, ఫీచర్స్ : పేదరికం, కంటే లైంగిక వేధింపులే భయంకరమైనవి. ఇది భారత్‌నే కాదు ప్రపంచ దేశాలనూ పట్టి పీడిస్తున్న సమస్య. పనిప్రదేశాలు, పాఠశాలలని కాకుండా అవకాశమున్న ప్రతీ చోట.. మహిళలకు ఇష్టమున్నా లేకున్నా.. నయానో, భయానో.. తేనెపూసిన కత్తులు దూస్తూనో లోబరుచుకునే నీచ సంస్కృతే రాజ్యమేలుతోంది. స్త్రీల పట్ల లైంగిక దోపిడీకి ఏదో ఒక విషయాన్ని కారణంగా చూపలేం. మహిళల శరీరాన్ని తాకేందుకు తహతహలాడుతూ వారిని బలవంతంగా అనుభవించాలకునే పురుషులు సమాజంలో ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. అయితే ఇలాంటి ఘటనలు సినిమా రంగంలోనే ఎక్కువనే రూమర్స్ లేకపోలేదు. కానీ కార్పొరేట్ నుంచి కాన్వెంట్ వరకు కొందరు స్నేహం నటిస్తూనే కమిట్‌మెంట్ కోసం కన్నింగ్ టాక్టిక్స్ ప్లే చేస్తుంటారు. మహిళల్ని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న ఇలాంటి సంఘటనలకు లెక్కలేకపోగా.. బయటకు చెబితే పరువు పోతుందని, చాలా మంది ఆ చేదు అనుభవాలను తమలోనే సమాధి చేసేస్తుంటారు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘మీ టూ మూమెంట్’ అలాంటి కొన్ని కొన్ని చీకటి సంఘటనలను బయటపెట్టింది. కాగా అవకాశాల పేరిట తెరవెనుక జరిగిన కొన్ని సెక్సువల్ హరాస్‌మెంట్స్‌..

Read more:

ప్రైవేట్ స్కూల్ ఓనర్‌తో సీఐ ఎఫైర్.. చితక్కొట్టిన భర్త

మొత్తం చూడాలన్నాడు..

‘ఒక నిర్మాత తనతో చనువుగా ఉంటేనే సినిమా ఆఫర్లు ఇస్తానని, దానికోసం నీ శరీరంలోని ప్రతీ అంగుళం గురించి నాకు తెలియాలన్నాడు. మరో జాతీయ అవార్డు పొందిన దర్శకుడు ఇంగ్లీష్, హిందీలో కాకుండా నాకు తెలియని భాషలో మాట్లాడుతూ బూతులు తిట్టేవాడు. బట్టలిప్పి డ్యాన్స్ చేయమని, నడవమని రకరకాలుగా అల్లరిపెట్టేవాడు. ఇక మరో నటుడు సినిమాలో క్యారెక్టర్‌ ఇచ్చే నెపంతో బాడీ పార్ట్స్ సరిగా ఉన్నాయో లేదో చూపించాల్సిందిగా బలవంతం చేశాడు’ అని బాలీవుడ్ నటి సర్వీన్ చావ్లా మీడియా ముందు తన గోడు వినిపించింది.

డోర్‌ క్లోజ్‌ చేయమన్నాడు..

‘ఓ చిన్న సినిమాలో అవకాశం కోసం దర్శక నిర్మాతలను కలిసేందుకు ఆఫీస్‌కు వెళ్లాను. ఆ సమయంలో గదిలో ఉన్న ప్రొడ్యూసర్‌ సినిమా గురించి చెబుతూ.. ఆఫీస్‌బాయ్‌తో సాఫ్ట్ డ్రింక్‌ తెప్పించి డోర్‌ క్లోజ్‌ చేయమని చెప్పాడు. తర్వాత తన వికృత బుద్ధి చూపించడం మొదలు పెట్టాడు. అవుట్‌‌డోర్‌ షూటింగ్‌లో తాను ఒంటరిగా ఉంటానని? సహకరిస్తే ఇద్దరికీ బాగుంటుందని’ అంటూ వెకిలిగా మాట్లాడాడని ఫన్‌ బకెట్‌ ఫేమ్ నాగ భార్గవి వివరించింది.

ఎక్కడెక్కడో తాకేవాడు..

‘18ఏళ్ల ప్రాయంలోనే ఇండస్ట్రీకి రావడంతో కెరీర్ మొదట్లో క్లోజ్‌గా ఉన్న వ్యక్తులు దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకునేవాళ్లు. అలా ఒకసారి ఓ చిన్న గదిలో స్క్రిప్ట్ చదువుతున్న సమయంలో క్రాఫ్ట్‌మెన్ నన్ను తాకడానికి ప్రయత్నించాడు. కానీ చాలాసేపటి వరకు ఏం జరుగుతుందో నేను గుర్తించలేకపోయాను. ఇదే అదనుగా భావించిన అతడు శరీరాన్ని మరింత గట్టిగా తడమడంతో వెంటనే తేరుకుని అక్కడి నుంచి పారిపోయాను. అప్పటి నుంచి పురుషులపై నమ్మకం పోయింది. ఒకే గదిలో నాన్నతో కూడా ఉండలేకపోతున్నాను’ అని సీరియల్ నటి ఆరాధన శర్మ వెల్లడించింది.

రిహార్సల్‌కు పిలిచి..

బాలీవుడ్‌లో కెరీర్ తొలినాళ్లలో ఓ వ్యక్తి నాతో క్లోజ్‌గా ఉండేవాడు. జీవితంలో ఓ గొప్ప మిత్రుడిలా నటించి, నమ్మించాడు. అయితే నేను నటిస్తున్న సినిమాలో ముద్దు సీన్ లేకపోయినా, అలాంటి సీన్ ఉంటే ఎలా నటిస్తావో చూడాలంటూ రిహార్సల్ చేయాలని పిలిచాడు. మొదట జోక్ చేస్తున్నాడనుకున్నా.. ఆ తర్వాత ముద్దు పెట్టుకోమంటూ బలవంతం చేశాడు. తనకున్న పరిచయాలతో ఇండస్ట్రీలో ఆఫర్లు వచ్చేలా చేస్తానంటూ మాయ మాటలు చెప్పి లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు’ అని జరీన్ ఖాన్ వెల్లడించింది.

బ్యాడ్ కామెంట్స్

ఒక ఫేమస్ టాలెంట్ ఏజెన్సీ కో ఫౌండర్ నన్ను ఎవరూ లేని రూమ్‌లోకి తీసుకెళ్లి, కింద నుంచి పై వరకు అదోలా చూడటం మొదలుపెట్టాడు. బాడీ పార్ట్స్ నిజమైనవా లేక డ్రెస్‌లో ఏమైనా తేడా ఉందా? టచ్ చేసి తెలుసుకోవచ్చా అని అడగడంతో ఒక్కసారిగా భయపడిపోయాను. వెంటనే చాలా కోపంతో అవకాశాల కోసం ఎంతో ఆశగా వచ్చే వారిని ఇలానే ట్రీట్ చేస్తారా? అంటూ ముఖంపైనే తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాను’ అని షెర్లిన్ బహిరంగంగానే మీడియాకు చెప్పింది.

సుఖం కావాలన్నాడు..

‘RX100 సినిమాలో నీ అందాలు చూసిన తర్వాత నిద్రపట్టట్లేదు. ఒక్క రాత్రి నాతో గడిపితే పెద్ద సినిమాలో నటించే చాన్స్ ఇస్తా అంటూ.. ఇండస్ట్రీకి చెందిన బడా పర్సనాలిటీ ఒకరు చేయి పట్టుకుని కారు ఎక్కించేందుకు ప్రయత్నించాడు. దాంతో నా మతిపోయింది, ఎప్పటికీ నీ సినిమాలో నటించనంటూ అతనికి గట్టిగా చెప్పేశాను’ అని తెలిపింది పాయల్ రాజ్‌పుత్.

ఆఫీసులో అదే తీరు..

ఒక హిందీ సినిమాలో ఆఫీస్ సీన్‌ చిత్రీకరణకు సంబంధించి.. ఓ మహిళా ఉద్యోగి అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది. అదే అదనుగా భావించిన బాస్ కుర్చీలో నుంచే ఆమె బాడీ కదలికలను గమనిస్తూ.. అతని పక్కకు వచ్చినపుడు ఆమె బ్యాక్, బ్రెస్ట్ తాకాలని నానా రకాలుగా ప్రయత్నిస్తుంటాడు. అది గమనించిన ఆ మహిళా ఉద్యోగి.. ‘సార్ ఎందుకు దొంగచాటుగా చూస్తున్నారు. చిన్నపుడు మీరు పాలు తాగిన మీ అమ్మ రొమ్ముల్లాగే నాకు రెండు రొమ్ములున్నాయి అంతే! కావాలంటే మొత్తం విప్పి చూసిస్తా’ అంటూ తన బట్టలు విప్పడానికి సిద్ధపడుతుంది. దాంతో షాక్ తిన్న బాస్.. సారీ సారీ అంటూ ఆఫీస్ స్టాఫ్ అందరి ముందు సిగ్గుతో తల దించుకుంటాడు.


Next Story