- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్చి నెల మంచిది కాదా..? పీరియడ్స్ ఎందుకు ఆలస్యం..? యువతుల్లో తీవ్ర చర్చ
మార్చి నెల మంచిది కాదంటూ వేల మంది అమ్మాయిలు పోస్టులు పెడుతున్నారు. ఈ నెల మహిళలకు శాపంగా మారిందని మీమ్స్‌తో ఉదరగొడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్ : యువతుల్లో మార్చి నెల తీవ్ర చర్చకు దారి తీసింది. కాలేజీ అమ్మాయిల నుంచి ఉద్యోగిణులకు వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదే చర్చ నడుస్తోంది. మార్చి నెల మంచిది కాదంటూ వేల మంది అమ్మాయిలు పోస్టులు, రీపోస్టులు చేస్తున్నారు. మరికొందరు మార్చి నెల మహిళలకు శాపంగా మారిందని మీమ్స్‌తో ఉదరగొడుతున్నారు. ‘మార్చి పీరియడ్ డిలే థియరీ’ (March period delay theory) పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అసలు ఎందుకు ఈ చర్చ వచ్చింది..? యువతుల్లో పీరియడ్స్ ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? ఈ నెలలోనే ఎందుకు అలా జరుగుతుందో తెలుసుకుందాం.
సోషల్ మీడియా ‘మార్చి పీరియడ్ డిలే థియరీ’ పై నడుస్తున్న చర్చకు ఈ నెలలో నెలసరి కరెక్ట్ టైంకు రాకపోవడమే. ‘మార్చిలో పీరియడ్స్ ఎందుకు ఆలస్యమవుతున్నాయి?’ అంటూ వేలమంది అమ్మాయిలు పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే, దీని వెనుక ఉన్న అసలు కారణం ఏదో పెద్ద మిస్టరీ కాదని, అది కేవలం ఒక చిన్న 'లెక్క' (Basic Math) అని నిపుణులు చెబుతున్నారు.
లెక్క తప్పడానికి ఫిబ్రవరి నెలే కారణం:
మార్చిలో పీరియడ్స్ ఆలస్యం కావడానికి ఫిబ్రవరి నెలనే కారణం అంటున్నారు వైద్యులు. కానీ అది గుర్తించకుండా చాలా మంది అమ్మాయిలు ఈ నెలలో తమకు లేట్ అయిందని కంగారు పడుతున్నారని గైనకాజిస్టులు అంటున్నారు. సాధారణంగా పీరియడ్స్ సైకిల్ 28 నుండి 31 రోజులు ఉంటుంది. కానీ ఫిబ్రవరి నెలలో కేవలం 28 రోజులే ఉంటాయి. ఉదాహరణకు, ఒకరికి ఫిబ్రవరి మొదటి వారంలో పీరియడ్ మొదలైతే.. వారి తదుపరి పీరియడ్ 30 రోజుల తర్వాత రావాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో రోజులు తక్కువగా ఉండటం వల్ల, ఆ లెక్క సహజంగానే మార్చి నెలలో ముందుకు జరుగుతుంది. అంటే, క్యాలెండర్ ప్రకారం రోజులు తక్కువగా ఉండటం వల్ల పీరియడ్ ఆలస్యమైనట్లు ఒక భ్రమ కలుగుతుంది తప్ప, అది నిజంగా ఆలస్యం కాదని మహిళలు గుర్తించాల్సిన అవసరం ఉంది.
‘మార్చి పీరియడ్ డిలే థియరీ’పై వైద్యులు ఏం చెబుతున్నారు?
‘మార్చి పీరియడ్ డిలే థియరీ’ చర్చపై ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కుంజల్ పారిఖ్ గుసాని ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. మార్చి నెలలో పీరియడ్స్ ఆలస్యం కావడానికి గత కారణాలు వివరించారు. చాలా మందికి మార్చి నెలలో ఆఫీసు డెడ్ లైన్లు, పరీక్షల టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఒత్తిడి వల్ల అండోత్పత్తి (Ovulation) ఆలస్యమై పీరియడ్స్ పై ప్రభావం పడుతుందన్నారు. అలాగే మారిన జీవనశైలి, నిద్ర సరిగ్గా లేకపోవడం కూడా ఒక కారణంగా ఆమె పేర్కొన్నారు. అంతే కాకుండా వాతావరణంలో మార్పులు, ప్రయాణాల వల్ల బాడీ సైకిల్ మారుతుందని డాక్టర్ కుంజల్ పారిఖ్ గుసాని వివరించారు. ఈ కారణాలతోనే పీరియడ్స్ ఆలస్యం అవుతాయని, కానీ మార్చి నెలలో ఎలాంటి శాపాలు, పాపాలు లేవన్నారు. ఒకవేళ ప్రతి నెల ఇలాగే ఆలస్యమవుతుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలని డాక్టర్ కుంజల్ పారిఖ్ గుసాని సూచించారు.






