చలి కాలంలో బరువు తగ్గే చిట్కాలు.. ఫాలో అయితే పక్కా రిజల్ట్!

by velandi.Saikiran |

ప్రస్తుతం చలికాలం కొనసాగుతోంది. చలికాలం నేపథ్యంలో జనాలందరూ గజ‌గజ వణికి పోతున్నారు. సా

చలి కాలంలో బరువు తగ్గే చిట్కాలు.. ఫాలో అయితే పక్కా రిజల్ట్!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ప్రస్తుతం చలికాలం కొనసాగుతోంది. చలికాలం నేపథ్యంలో జనాలందరూ గజ‌గజ వణికి పోతున్నారు. సాధారణంగా చలికాలం రాగానే జనాలు కాస్త బరువు పెరుగుతారు. అయితే ఈ వింటర్ సీజన్ బరువు తగ్గకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ముఖ్యంగా వారానికి మూడు నుంచి నాలుగు రోజులు ఉదయం పూట పరిగడుపున జీరా- వాము నీళ్లు తాగాలని సూచిస్తున్నారు వైద్యులు. ఈ మిశ్రమాన్ని మరిగించి, వడగట్టి తాగాలని చెబుతున్నారు. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయట.

చలికాలంలో జొన్న రొట్టెలు, ఉప్మా, అంబలి, దోశలు తినాలని చెబుతున్నారు. జొన్నతో తయారుచేసిన వంటకాలు తింటే ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. దానివల్ల కొంచెం తిన్నా కూడా బాగా తిన్న ఫీలింగ్ ఉంటుంది. తద్వారా చలికాలంలో మన శరీర బరువు పెరగదని వైద్యులు స్ప‌ష్టం చేస్తున్నారు. కావలసిన శక్తి ఆటోమేటిక్ గా వస్తుందట‌. డ్రై ఫ్రూట్స్ కూడా తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు వైద్యులు.

వీటివల్ల మెటబాలిక్ రేటు 10% పెరగనుందట. విటమిన్ E శరీరానికి అంది బరువు కంట్రోల్లో ఉంటుందట. పాలకూర, క్యారెట్ ల‌తో చేసిన సూప్స్‌ చలికాలంలో ఎక్కువగా తాగాలని చెబుతున్నారు వైద్యులు. దాని వల్ల కూడా బరువు కంట్రోల్ లో ఉంటుందట. అలాగే ఈ వెజిటేబుల్ సూప్స్ తాగడం వల్ల విటమిన్ సి శరీరానికి బాగా లభిస్తుందని చెబుతున్నారు. తద్వారా రోగనిరోధక శక్తి కూడా విపరీతంగా పెరుగుతుందట. పైన పేర్కొన్న టిప్స్ పాటిస్తే, బరువు కంట్రోల్ లో ఉంటుందని చెబుతున్నారు.

Next Story