- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దంపతుల్లో ఏ సమస్యా లేదు.. మరి పిల్లలు ఎందుకు పుట్టట్లేదు..
దంపతులకు పెళ్లి జరిగి పదేళ్లకు పైనే అయింది. కానీ పిల్లలు పుట్టట్లేదు. పైగా వారిలో ఏ సమస్య లేనప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది?

దిశ, ఫీచర్స్ : మేడమ్.. అన్నయ్య వివాహమై ఆరు ఏళ్లు అవుతుంది. పిల్లల కోసం చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్లినా ఫలితం లేదు. వాళ్ళిద్దరికి అన్ని రిపోర్ట్స్ నార్మల్‌గా ఉన్నాయి. అసలు వంధ్యత్వానికి దారితీసే ప్రత్యేకమైన కారణాలు ఏంటో చెప్తారా?
ఏ రకమైన కుటుంబ నియంత్రణ సాధనాలు ఉపయోగించకుండా.. మందులు వాడకుండా క్రమం తప్పకుండా ఒక ఏడాదిపాటు శృంగారంలో పాల్గొన్నప్పటికీ.. పిల్లలు పుట్టక పోవడాన్ని ప్రాథమిక వంధ్యత్వం అంటారు. శారీరక, హార్మోన్ల లోపాలు కాకుండా వంధ్యత్వానికి దారి తీసే శ్రుంగార పరమైన కారణాలు:
1) కలయిక జరగక పోవడం
పెళ్ళైనా ఒక్కసారి కూడా కలయిక జరగకపోవడం వల్ల 5% మందికి పిల్లలు పుట్టరు. కొన్నిసార్లు పెళ్ళైన 15 సంవత్సరాల వరకు కూడా ఏ శారీరక, వ్యాధులు, హార్మోన్ల లోపాలు లేకపోయినా కేవలం మానసిక కారణాల వలన దంపతుల్లో కొంతమందికి పిల్లలు పుట్టరని తెలిసింది.
2) పురుషుల వైపు నుంచి శృంగార లోపాలు
a) అంగస్తంభన సమస్యలు/ప్రాథమిక, ద్వితీయ కారణాలు
b)వీర్య స్ఖలన లోపాలు
పెర్ఫార్మెన్స్ యాంగ్జయిటీ, భయం వలన వెజినల్ ఇంటర్ కోర్సు కంటే ముందే వీర్యం వెజీనా బయటే స్ఖలించబడటం.
c) అంగ స్తంభన ఉన్నప్పటికీ భార్యకు గర్భం వస్తుందన్న భయం లేదా భార్య పట్ల ఇష్టం లేక పోవడం వలన కూడా వీర్య స్ఖలనం కాకపోవడం.
d) స్ఖలించబడిన వీర్యం బయటకు రాకుండా తిరిగి వెనక్కి మూత్రాశయంలోకి వెళ్లిపోవడం
e) వీర్య స్ఖలనం అనేక సార్లు అవడం వలన వీర్య కణాల సంఖ్య తగ్గుతుంది. ఇది habituated masterbation(హాబిట్యువేటెడ్ మస్టర్బేషన్) అనే మనోలైంగిక సమస్యలో ఉంటుంది.
3) స్త్రీల వైపు నుంచి వంధ్యత్వ లోపాలు
a) భయంతో, భర్త పట్ల అయిష్టతతో వెజీనా కండరాలను అనియంత్రణగా బిగదీసే వెజినిసమస్ అనే స్థితిలో కలయిక దుర్లభం అవుతుంది. దీన్ని పురుషులు భార్యలతో ప్రవర్తించే దౌర్జన్య అహంకార ధోరణులకు భార్యల తిరస్కార చర్యగా భావించవచ్చు.
b) నొప్పితో కూడిన సంయోగం: నొప్పి కలుగుతుందన్న భయం...భర్త దౌర్జన్యంగా ప్రవర్తించడం.. వీటితో పాటుభర్త, అత్త, ఆడబిడ్డల వరకట్న హింసలు, పని ఒత్తిడి, చదువు మధ్యలో ఆగిపోవడం, అవాంఛిత గర్భం వచ్చి చదువు, కెరీర్ నాశనం అవుతాయేమో అనే భయం.. పుట్టింటి బంధాలకు దూరం కావాల్సి రావడం.. పెళ్లి తర్వాత స్త్రీల ఆశయ, ఆకాంక్షలు తీరకపోవడం వంటి విషయాల కారణంగా డిప్రెషన్ కూడా స్త్రీలలో సెక్స్ పట్ల విముఖత ఉండి అవాయిడ్ చేయడం కూడా ఒక కారణం. ఒక వేళ కలయిక జరిగినా.. డిప్రెషన్ వలన హార్మోనల్ ఇంబ్యాలెన్స్‌తో అండం సరిగా విడుదల కాక గర్భం రాదు.
c) వెజీనాలో ఉండే ఆమ్ల, క్షార పీహెచ్‌లలో తేడా వీర్య కణాలను నాశనం చేస్తాయి. స్రీలు పూర్తిగా శృంగారంలో ఉద్దీపన చెందక పోవడం కూడా ఈ స్ధితికి కారణం. దీనికి పరిష్కారంగా వాడే వెజీనాల్ లూబ్రి కేషన్స్ వలన కూడా వీర్య కణాలు నాశనం అవుతాయి. ఇవి స్త్రీ, పురుషుల వైపు నుంచి వంధ్యత్వానికి దారి తీసే శృంగార కారణాలు. కాగా భార్యాభర్తలు ఇద్దరూ marital therapist వద్ద కౌన్సిలింగ్ & థెరపీకి వెళ్తే ప్రయోజనం ఉంటుంది.






