శృంగారంలో మునిగితేలుతాం.. మజా రాలేదంటే కొడుతం, తన్నుతం.. సంచలన విషయాలు బయటపెట్టిన అధ్యయనం

by Sujitha Rachapalli |

ఆస్ట్రేలియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ స్టడీస్ (AIFS) నిర్వహించిన అధ్యయనం సంచలన విషయాలు బయటపెట్టింది. ‘టెన్ టు మెన్’ అనే ప్రపంచంలోనే మొట్టమొదటి లాంగిట్యూడినల్ అధ్యయనం.. 18–65 సంవత్సరాల వయస్సు గల ఆస్ట్రేలియా పురుషుల్లో ముగ్గురిలో ఒకరు

శృంగారంలో మునిగితేలుతాం.. మజా రాలేదంటే కొడుతం, తన్నుతం.. సంచలన విషయాలు బయటపెట్టిన అధ్యయనం
X

దిశ, ఫీచర్స్ : ఆస్ట్రేలియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ స్టడీస్ (AIFS) నిర్వహించిన అధ్యయనం సంచలన విషయాలు బయటపెట్టింది. ‘టెన్ టు మెన్’ అనే ప్రపంచంలోనే మొట్టమొదటి లాంగిట్యూడినల్ అధ్యయనం.. 18–65 సంవత్సరాల వయస్సు గల ఆస్ట్రేలియా పురుషుల్లో ముగ్గురిలో ఒకరు (35%) తమ ఇంటిమేట్ పార్టనర్ వైలెన్స్ చేసినట్లు నివేదించారు. ఈ రేటు 2013–14లో నలుగురిలో ఒకరు ఉండగా.. ఇప్పుడు పెరిగింది. 2013–14 నుండి 2022 వరకు నిర్వహించిన ఈ అధ్యయనం.. 2023–24లో అదనంగా 10,000 మంది పురుషులను చేర్చి... 16,000 మందిని ట్రాక్ చేసింది. ఆస్ట్రేలియాలో పురుషులు తమ శృంగార భాగస్వాములను టార్చర్ చేయడం గురించి మొదటి జాతీయ అంచనాను అందించింది. సంవత్సరానికి సుమారు 1,20,000 మంది పురుషులు ఈ పనిలో ఉన్నారని గుర్తించింది.

కీలక అంశాలు :

* ఎమోషనల్ అబ్యూస్ అత్యంత సాధారణంగా మారింది. 32% మంది పురుషులు తమ ఇంటిమేట్ పార్టనర్‌ను భయపెట్టారు. ఆందోళనకు గురిచేశారు.

* 9% మంది ఫిజికల్ అబ్యూస్ చేసినట్లు నివేదించారు. కోపంలో ఉన్నప్పుడు పార్టనర్‌ను కొట్టడం, తన్నడం చేశారు.

* ఒక దశాబ్దంలో 24% నుండి 35%కి పెరగడం ఆందోళన కలిగిస్తుంది. జెండర్-ఆధారిత హింసను అరికట్టడానికి జాతీయ ప్రయత్నాలు ఉన్నప్పటికీ ఈ పరిస్థితులు నెలకొనడం భయంకరంగా ఉందని అంటున్నారు నిపుణులు.

ప్రమాద కారకాలు:

* 2013–14లో తీవ్రమైన డిప్రెసివ్ లక్షణాలు ఉన్న పురుషులు 2022 నాటికి భాగస్వామిని కొట్టే అవకాశం 62% ఎక్కువగా ఉంది. స్వల్ప లక్షణాలు ఉన్నవారు 32% ఎక్కువ అవకాశం కలిగి ఉన్నారు.

* ఆత్మహత్య ఆలోచనలు, ప్రణాళికలు చేసిన పురుషులు వాయిలెన్స్‌కు పాల్పడే అవకాశం 47% ఎక్కువ.

* డిప్రెసివ్ లక్షణాలు ఉన్న కొద్ది మంది పురుషులు మాత్రమే ఇలా చేస్తున్నారని తెలిపిన అధ్యయనం.. వ్యక్తిగత అంచనాల అవసరాన్ని నొక్కి చెప్పింది.

Next Story