కోరికలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా.. భర్త ఉన్నా బాయ్‌ఫ్రెండ్‌తో దొరికిపోయా..

by Sujitha Rachapalli |   (  Updated:2026-02-19 13:00:43  IST  )

తప్పు అని తెలిసినా తప్పు చేస్తున్న మహిళ.. కోరికలు కంట్రోల్ చేసుకోలేక దొరికిపోయినా.. ఆ తర్వాత మళ్లీ అదే తప్పు కొనసాగిస్తుంది..

కోరికలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా.. భర్త ఉన్నా బాయ్‌ఫ్రెండ్‌తో దొరికిపోయా..
X

మేడమ్.. నాకు పెళ్లై 12 సంవత్సరాలు అవుతోంది. ఇద్దరు పిల్లలు. నాకు చిన్నప్పటి నుంచి శృంగార కోరికలు ఎక్కువ. మా ఆయనతో రోజూ శృంగారంలో పాల్గొన్నా కూడా వీలు దొరికినప్పుడల్లా మా బాయ్ ఫ్రెండ్‌తోనూ పాల్గొంటున్నాను. ఒకసారి ఇంట్లో దొరికిపోయాను. అందరూ తిట్టారు, కొట్టారు కూడా. పరువు పోయిందని ఆత్మహత్యకు ప్రయత్నించా. కానీ విఫలమైంది. అయినా.. నా పద్ధతి మారలేదు. పిల్లలు అనాథలు కాకూడదని మా ఆయన నన్ను భరిస్తున్నారు. నేను చేసేది తప్పు అని నాకు తెలుసు. కానీ మానలేకపోతున్నాను. మా ఆయనతో, పిల్లలతో కలిసి ఆనందంగా ఉండాలని ఉంది. నన్నేం చేయమంటారు. నేను పెరిగింది చెడు వాతావరణంలో కాబట్టి ఇలా అలవాటైంది. నా శృంగార కోరికలను తగ్గించుకోవడానికి ఏవైనా మార్గాలుంటే చెప్పండి. ఏవైనా టాబ్లెట్స్ ఉంటే రాయండి?

మీ ఆయనతో, పిల్లలతో సంతోషంగా ఉండాలన్న కోరికే నీలో మార్పుని తీసుకొస్తుంది. నీలోని ఘర్షణ, పశ్చాత్తాపం నిన్ను మారుస్తాయి. సెక్సాలజిస్ట్ లేదా సైకోథెరపిస్ట్ వద్ద మనోలైంగిక చికిత్స తీసుకో. అవధులు లేని శృంగార కోరికలు, ఎక్కువ మందితో సంబంధాలు ఒక రకమైన మనోలైంగిక సమస్య. నువ్వు పెరిగిన వాతావరణం కూడా కారణం. అయితే, ఇప్పుడు ఆ వాతావరణంలో లేవు కదా? నీ బలహీనతలను క్షమించి భరించే భర్త, ఇద్దరు పిల్లలు, వాళ్ళ బాధ్యత నీ మీదున్నాయి. పిల్లల జీవితంపై తల్లిదండ్రుల నడవడిక చాలా ప్రభావాన్ని చూపుతుంది. నీ అనైతిక జీవన ప్రభావం కారణంగా నీ పిల్లలు పెరిగాక వారి జీవితం నాశనమయ్యే అవకాశం ఉంది. కన్నబిడ్డలు అసహ్యించుకోవడం నీకు గౌరవమా? వెంటనే మనోలైంగిక చికిత్స తీసుకో. నీ జీవితం బాగుపడుతుంది.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Next Story