Tongue Condom: హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ‘నాలుక కండోమ్స్’ సేల్స్

by Bhoopathi Nagaiah |

ఓరల్ సెక్స్ చేసే శృంగార ప్రియుల కోసం మార్కెట్‌లోకి కొత్తగా నాలుక కండోమ్ ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్‌లో వీటి సేల్స్ విపరీతంగా పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.

Tongue Condom: హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ‘నాలుక కండోమ్స్’ సేల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: శృంగార ప్రియులకు ఇప్పుడు మరో కండోమ్(Condom) అందుబాటుకి వచ్చింది. ఇప్పటి వరకు మేల్ కండోమ్, ఫిమేల్ కండోమ్‌తోనే సరిపెట్టుకున్న వాళ్లను తాజాగా ‘నాలుక కండోమ్’ విరివిగా ఆకట్టుకుంటుంది. సురక్షితమైన శృంగారానికి ఇదో బెస్ట్ కండోమ్‌గా అభివర్ణిస్తున్నారు వైద్య నిపుణులు. ఈ ‘నాలుక కండోమ్’ (Tongue Condom)ను ‘టంగ్ స్లీవ్స్’ (Tong Sleeves) అని కూడా పిలుస్తారు. సురక్షితమైన కలయిక, లైంగిక ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి కండోమ్స్‌ను ఉపయోగిస్తారు. అయితే ఇప్పటి వరకు స్త్రీ, పురుషుల కలయిక సమయంలో జననాంగాలకు కండోమ్‌ వాడుతున్నారు. కానీ ఓరల్ సెక్స్‌(నోటి ద్వారా జరిపే లైంగిక ప్రక్రియ) ద్వారా సంక్రమించే వ్యాధులను అడ్డుకట్ట వేయలేకపోయారు. లిఫ్ లాక్ కిస్, అంగ చుంబనాలు, ఓరల్ సెక్స్(Oral sex), సుఖ వ్యాధుల(Sexually transmitted diseases) నుంచి శృంగార ప్రియులను రక్షించడానికే ‘నాలుక కండోమ్’ అందుబాటులోకి వచ్చింది. రెండు దశాబ్ధాల క్రితమే ప్రాశ్చాత్య దేశాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ ‘నాలుక కండోమ్స్’ ప్రస్తుతం హైదరాబాద్‌(Hyderabad)లోనూ భారీగా సేల్స్ పెంచుకుందంటే అతిశయోక్తి కాదు. మరి ఈ ‘నాలుక కండోమ్స్’ ఎక్కడ లభిస్తున్నాయి, ధర ఎంత ఉంది? ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం.

నాలుక కండోమ్‌తో ఉపయోగం ఏంటి..?

సాధారణ కండోమ్‌లు పురుషాంగానికి ఉపయోగిస్తే, నాలుక కండోమ్‌లను నాలుకకు తొడుగులా ఉపయోగిస్తారు. ఇది ఓరల్ సెక్స్ సమయంలో రక్షణ కోసం రూపొందించారు. లైంగిక తృప్తి కోసం భాగస్వాములు జననాంగాలను నాలుకతో స్పృశిస్తుంటారు. ఆ సమయంలో ఒకరి శరీరం నుంచి మరొకరి శరీరంలోకి ప్రమాదకర వైరస్‌లు వ్యాప్తించే అవకాశం ఉంది. లిఫ్ లాక్ కిస్‌ల ద్వారా లాలాజలం షేరింగ్ అయ్యి సంక్రమించే వ్యాధులను ఈ నాలుక కండోమ్ అరికడుతుంది. అలాగే ఇవ్వి స్ట్రాబెర్రీ, చాక్లెట్, వెనీలా వంటి ఫ్లేవర్లతో లభిస్తాయి. దీనివల్ల ఓరల్ సెక్స్, ముద్దుల సమయంలో కలిగే అసహజ రుచిని అరికట్టి, ఆ ఫ్లేవర్ టేస్టును అందిస్తుంది. ఓరల్ సెక్స్ ద్వారా వ్యాపించే ఎయిడ్స్ (HIV), సిఫిలిస్, గోనేరియా, హెర్పెస్ వంటి లైంగిక సంక్రమణ వ్యాధుల (STIs) ప్రమాదాన్ని నాలుక కండోమ్ అడ్డుకుంటుంది. భాగస్వాముల మధ్య నేరుగా శారీరక ద్రవాలు తాకకుండా అరికడుతుంది.

సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..?

నాలుక కండోమ్స్‌ను సాధారణ కండోమ్‌ల లాగే మెత్తటి లేటెక్స్ (Latex) లేదా పాలియురేథేన్ (Polyurethane)తో తయారు చేస్తారు. ఇవి చాలా సన్నగా, నాలుక కదలికలకు అనుగుణంగా కదులుతుంది. ఈ కండోమ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకపోయినా లేటెక్స్ పదార్థం పడని వాళ్లకు నాలుకపై దద్దుర్లు, దురద వచ్చే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. అలాగే నాలుకకు కండోమ్‌ను సరిగ్గా అమర్చుకోకపోతే గొంతులోకి జారే అవకాశం ఉంది.

దేశ వ్యాప్తంగా 15-20 శాతం పెరిగిన సేల్స్

నాలుక కండోమ్స్ 2000 సంవత్సరం ప్రారంభంలోనే పాశ్చాత్య దేశాల్లో అందుబాటులోకి వచ్చాయి. సాధారణ కండోమ్స్‌తో పోల్చుకుంటే ఇండియాలో నాలుక కండోమ్స్‌పై అవగాహన చాలా తక్కువ. గడిచిన రెండేళ్లుగా మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లలో నాలుక కండోమ్‌లపై యువతలో అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో సేల్స్ గణనీయంగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇండియా 2024 నాటికి కండోమ్ మార్కెట్ రూ.7,200 కోట్లుగా నమోదైంది. అయితే ఈ సేల్స్‌లో 98శాతం వాటా పురుషుల సాధారణ కండోమ్‌లదేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే నాలుక కండోమ్‌ల కోసం విడిగా టర్నోవర్ గణాంకాలు అందుబాటులో లేవు. కానీ,ఇవి సెక్స్ వెల్నెస్ (Sexual Wellness), నిష్ ప్రొడక్ట్స్ (Niche Products) విభాగంలోకి వస్తుండటంతో కండోమ్ జాబితాలోకి పరిగణించలేదు. ఇండియాలో సెక్స్ వెల్నెస్ మార్కెట్ 2025 చివరి నాటికి రూ.12,000 కోట్లు ఆదాయాన్ని ఆర్జించిందని అంచనా. నాలుక కండోమ్‌లు వంటి కొత్త రకాల ఉత్పత్తుల విక్రయాలు ఏటా 15-20 శాతం వృద్ధి నమోదు చేస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

80 శాతం యువత ఆన్‌లైన్‌లోనే ఆర్డర్స్

ఇక హైదరాబాద్‌లోని ఐటీ హబ్‌లలో వీటి విక్రయాలు ఆశాజనకంగా ఉన్నాయి. నాలుక కండోమ్స్ ఎక్కువ ప్రాచుర్యంలో లేనందున మెడికల్ షాపుల్లో లభించడం అరుదుగానే ఉన్నా ఆన్‌లైన్‌లో మాత్రం 80 శాతం కంటే ఎక్కువ విక్రయాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా Amazon, Flipkart, Sirona, MyMuse వంటి ప్రత్యేక సెక్స్ వెల్నెస్ పోర్టల్స్(Sex Wellness Portals) ద్వారానే సేల్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఇ-కామర్స్ డెలివరీలు వేగంగా ఉండటం వల్ల యువత వీటి వినియోగంపై ఆసక్తి పెంచుకుంటున్నారు. వీటి ధర బ్రాండ్, ప్యాక్ పరిమాణం, ఫ్లేవర్‌ను బట్టి ఆన్‌లైన్‌లో ఒక ప్యాకెట్ (సుమారు 3 నుండి 5 కండోమ్‌లు) ధర రూ.200 నుండి రూ.600 వరకు లభిస్తుంది. రాబోయే 5 ఏళ్లలో తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వీటి వినియోగం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ నాలుక కండోమ్ కేవలం సుఖవ్యాధులు నివారణకు మాత్రమే ఉపకరిస్తుంది తప్ప.. గర్భం రాకుండా అడ్డుకోదని శృంగార ప్రియులు గుర్తించాల్సిన అవసరం ఉంది.

Next Story