Personal Life : ఆ విషయంలో భార్యపై అనుమానం.. పెళ్లికి ముందు అలా జరిగిందేమోనని..

by Javid Pasha |

Personal Life : ఆ విషయంలో భార్యపై అనుమానం.. పెళ్లికి ముందు అలా జరిగిందేమోనని..
X

ప్రశ్న: మేడం.. నా వయసు 28 సంవత్సరాలు. బీ.ఎడ్ పూర్తయ్యాక ఈ మధ్యనే పెళ్లయింది. నా భార్య వక్షోజాలు వదులుగా, యోని పెద్దగా ఉన్నాయి. పెళ్లికాని అమ్మాయిల వక్షోజాలు స్టిఫ్‌గా, యోని చిన్నగా ఉంటుందంటారు కదా. నాకు తనతో సెక్స్‌లో తృప్తి కలుగడం లేదు. అంగప్రవేశం చేసినప్పుడు తనకి నొప్పి కూడా కలుగలేదు. వయస్సును బట్టి యోని, వక్షోజాలు ఉంటాయంటారా ? నా స్నేహితులు అంటున్నట్టు ఆమెకు పెళ్లికి ముందు ఏవైనా సంబంధాలు ఉన్నాయంటారా ? నాకు మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నాను.

- శంకర్, శ్రీకాకుళం

జవాబు : నువ్వు బీ.ఎడ్ చేసినా.. స్త్రీలని గౌరవించే సంస్కారం లేదు. చదువుకున్న మనుషులు ఇలా మాట్లాడరు. నువ్వు క్షోభ పడుతూ.. పాపం నీ భార్యను అనుమానాలతో వేధిస్తున్నావు. వక్షోజాల్లో కండరాలు ఉండవు. కొవ్వు కణాలు, గ్రంధులు పాలను చనుమొనల ద్వారా తీసుకువెళ్లే పాల నాళాలు మాత్రమే ఉంటాయి. ఇవన్నీ కూడా మెత్తనైన, అనుసంధాన కణజాలంతో బంధించబడి ఉంటాయి. అందరికీ ఇలా దగ్గరగా ఉండాలని ఏమీ లేదు. వివాహానికి వక్షోజాల పరిణామానికి సంబంధం లేదు. వక్షోజాల అంతర్గత కణజాల అమరికల్లో తేడా వల్ల వ్యక్తికీ.. వ్యక్తికి.. వేర్వేరుగా ఉంటుంది. వివాహానికి ముందు స్త్రీలు సెక్స్‌లో పాల్గొంటే వక్షోజాలు మెత్తగా సాగినట్టుగా అవుతాయనేది ఒక మూర్ఖమైన అజ్ఞానం మాత్రమే. పెళ్లయ్యాక గర్భం దాల్చి బిడ్డకు పాలిచ్చే సమయంలో వక్షోజాల బిగువులో కాస్త మార్పు వస్తుంది. కొద్దిగా అంతర్గత కణజాలం మెత్తగా అవుతుంది. కొద్దిగా పెద్దగా అవుతాయి. స్త్రీలలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ల స్థాయిలో పెళ్లికి ముందు, తర్వాత దశలో చాలా తేడా ఉంటుంది. ఈ హార్మోన్లు వక్షోజాల పరిమాణం ఎక్కువ, తక్కువ అవ్వడానికి దోహదం చేయడంతో పాటు చనుమొనలు పగలకుండా కాపాడతాయి.

నీకున్న రెండవ అనుమానం.. నీ భార్య యోని వదులుగా ఉందని. నీ అనుమానపు ఆలోచనల మంటలకు మిడిమిడి జ్ఞానం ఉన్న స్నేహితులు ఆద్యం పోస్తున్నారు. భర్తపై ప్రేమ ఆకర్షణ ఉన్న భార్య, అతని స్పర్శకి పులకరిస్తుంది. దానికి తగ్గట్టుగా దేహంలో యోని నాళంలో సెక్స్ గ్రంథులు స్రవిస్తాయి. దానివల్ల యోని కండరాలు సంకోచ, వ్యాకోచాలకు లోనై కొద్దిగా మెత్తబడి అంగప్రవేశానికి అనువుగా మారుతుంది. అందువల్ల అంగప్రవేశం అప్పుడు నొప్పి ఉండదు. సెక్స్ సమయంలో పురుషులకు కూడా స్రావాలు స్త్రీల కంటే అధికంగా విడుదలవుతాయి. అవి స్త్రీల స్రావాల కంటే ఎక్కువ జిగురుగా జారుడు గుణంతో ఉంటాయి. దీనివల్ల భర్తకు సహకరించే భార్య యోనిలోకి సులభంగా అంగప్రవేశం జరిగిపోతుంది. ఇద్దరూ శుభ్రమైన, ఉతికిన కాటన్ గుడ్డతో శృంగారం ఫోర్ ప్లే మధ్యలో తుడుచుకుంటూ ఉండాలి. ఫోర్ ప్లే ఎక్కువ సేపు చేస్తే యోని నాళం ముందుభాగపు గోడల్లో రక్త ప్రసరణ జరిగి, ఉబ్బి ఆ భాగం దాదాపు 1/3వ భాగం బిగుతుగా అవుతుంది. యోని స్రావాలతో వదులుగా కాదు. అందుకే ఫోర్ ప్లే ఎక్కువ సేపు చేయాలి. ఈ లైంగిక జ్ఞానం లేకనే నువ్వు నీ భార్య మీద అనుమానం పడుతూ క్షోభను అనుభవిస్తున్నావు. ఒకసారి సెక్సాలజిస్ట్‌ను, మ్యారేజ్ కౌన్సెలర్‌ని సంప్రదించు.

- డాక్టర్ భారతి

సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్

ప్రీ & పోస్ట్ మేరేజ్ &

సెక్సువల్‌ కౌన్సెలింగ్

86885 19225

Next Story